Bollywood: షార్జా విమానాశ్రయంలో బాలీవుడ్ నటి అరెస్ట్.. ఎందుకంటే..!
బాలీవుడ్(Bllywood) నటి క్రిసాన్ పెరీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల కింద యూఏఈలోని షార్జాలో మాదకద్రవ్యల అక్రమ రవాణా చేసిందని ఆమెను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిసాన్ పెరీరా ప్రస్తుతం షార్జా సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో పెరీరాను కావాలనే ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిసాన్ ను అరెస్ట్ చేసిన 72 గంటల తర్వాత తమకు విషయం తెలిందని చెప్పారుు. భారత కాన్సులేట్ పెరీరా అరెస్ట్ అయినట్లు తమ సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. తన సోదరిని రెండు వారాలుగా దుబాయ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని పెరీరా సోదరుడు కెవిన్ ఆరోపించారు.
డ్రగ్స అక్రమ రవాణా వెనుక రవి అనే వ్యక్తి క్రిసాన్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిసన్ దుబాయ్‌లో ఆడిషన్ చేయడానికి వెళ్లిందని.. అందుకు రవి అనే వ్యక్తి ఏర్పాట్లు చేశాడని చెప్పారు. ఏప్రిల్ 1న క్రిసన్ విమానం ఎక్కే ముందు నిందితుల నుంచి ఆమెకు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ఒక కాఫీ షాప్‌లో పెరీరాను కలుసుకున్నారని గుర్తించారు. వారు ఆమెకు ట్రోఫీని అందజేశారు. ఈ ట్రోఫీ ఆడిషన్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌లో భాగమని క్రిసాన్ తల్లి చెప్పారు.

బాలీవుడ్ నటులుపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదేమి కొత్త కాదు. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశినట్లు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై ఆరోపణలు వచ్చాయి. నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా ఉన్నాడు.
జూన్ 14, 2020న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రాథమికంగా అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించినా..దీనిపై సుశాంత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం దక్షిణాదికి చెందిన ఓ నటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని త్రిక్కక్కరాలోని ఉనిచిర థోపిల్ జంక్షన్‌లో ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నటి అంజుకృష్ణ కొంతకాలంగా అద్దెకు ఉంటుంది.
థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి తన అపార్ట్‌మెంట్‌లో నుంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిటీ పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో యోధవ్ స్క్వాడ్ మార్చి 22న నటి అంజు కృష్ణ ఇంటిపై దాడి చేసి 56 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ఎండీఎంఏను స్వాదీనం చేసుకున్నారు.టాలీవుడ్ నటులపై కూడా అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి పలు టాలీవుడ్ ప్రముఖలను విచారించారు. గతేడాది బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంఘటన అప్పట్లో సంచలనంగా మారిని విషయం తెలిసిందే.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications