వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బజరంగీ భాయీజాన్ డైరెక్టర్‌కు పాక్‌లో చేదు, చెప్పు చూపించి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: బజరంగీ భాయిజాన్ దర్శకుడు కబీర్ ఖాన్‌కు పాకిస్థాన్‌లో అవమానం ఎదురయింది. కాన్ఫరెన్స్ నిమిత్తం కరాచీ వెళ్లిన కబీర్ ఖాన్‌ను కొంతమంది పాకిస్థానీయులు కరాచీ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చిత్రాలు తీయడం తగదని నిరసన వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి అయితే ఆగ్రహంతో ఊగిపోతూ ఖాన్‌కు తన షూ చూయించి హెచ్చరించాడు. కొందరు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్‌లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు.

Bollywood

బూటు పట్టుకున్న వ్యక్తి ఊగిపోతూ... పాక్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీనిని సహించబోమని పదెపదే హెచ్చరించాడు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్ సినిమా పాక్‌లో వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కాగా, కబీర్ ఖాన్ కాబూల్ ఎక్స్‌ప్రెస్(2006), న్యూయార్క్(2009), ఏక్ థా టైగర్(2012) చిత్రాలకు దర్శకత్వం వహించారు.

English summary
Bollywood director Kabir Khan, known for blockbuster Bajrangi Bhaijaan, was heckled at Karachi airport for making anti-Pakistan films, media reported.
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X