ట్రిక్స్ తెలియదని: అందుకే ఎన్నికల్లో రాఖీసావంత్ పోటీ
ముంబై: ప్రముఖ బాలీవుడ్ ఐటం గర్ల్, నటి రాఖీ సావంత్ మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఆమె పోటీ చేయలనుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట. మెట్రో నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత... రక్షణ తదితర లక్ష్యాలతో ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఆమె ప్రత్యర్థులు కాంగ్రెసు పార్టీ నుండి గురుదాస్ కామత్, శివసేన పార్టీ నుండి గజానన్ కీర్తికర్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నుండి ప్రముఖ దర్శక నటులు మహేష్ మంజ్రేకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మన్యక్ గాంధీలుగా ఉండనున్నారు.

రాఖీ సావంత్
బుధవారం రాఖీ సావంత్ మాట్లాడుతూ... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను వాయువ్య ముంబై నుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

రాఖీ సావంత్
ఏ పార్టీ నుండి పోటీ చేస్తారని ప్రశ్నించగా... తనకు ఓ పార్టీ టిక్కెట్ ఆఫర్ చేసిందని, త్వరలో తాను ఆ వివరాలు బయటపెడతానని చెప్పారు.

రాఖీ సావంత్
తనకు రాజకీయాలు తెలియవని కానీ, సామాన్యుడి సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

రాఖీ సావంత్
సమాజానికి మంచి చేయాలనుకుంటున్నానని, తాను ఒక రాజకీయ నాయకురాలిగా మారాలని అనుకోవడం లేదని, తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

రాఖీ సావంత్
తాను గత ఏడేళ్లుగా ఎంతో సామాజిక సేవ చేస్తున్నానని ఈ బాలీవుడ్ ఐటం గర్ల్, నటి రాఖీ సావంత్ చెప్పారు. మహిళలకు రక్షణనే తన లక్ష్యమన్నారు.

రాఖీ సావంత్
ముంబైని మరో ఢిల్లీలా చూడాలనుకోవడం లేదని చెప్పిన రాఖీ సావంత్... మహిళలు తమ స్వీయ రక్షణ కోసం తాను కరాటేలో శిక్షణ తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications