ఒక్క రాత్రికి రూ.80వేలు: బాలీవుడ్ ప్రముఖుడి గలీజ్ దందా..విదేశీ మహిళలతో వ్యభిచారం
ముంబై: అసలే ముంబై మహానగరం. ఎటుచూసినా గలీజ్ దందాలే. దేశ ఆర్థిక రాజధాని కావడంతో ఇక్కడ విందు మందు పొందు అన్నీ కామనే. బార్ డ్యాన్సులు, నైట్ క్లబ్బులతో పాటు ఇక్కడ అన్ని దందాలు జరుగుతాయి. అయితే ఇవి వెలుగులోకి వస్తేనే వార్తలు. లేదంటే గుట్టు చప్పుడు కాకుండా ఎంత కాలమైనా ఈ గలీజు పనులను కొనసాగించే వారున్నారు. ఒకచోట దాడులు జరిగి పట్టుబడితే మరో చోటికి మకాం మారుస్తూ నిత్యం వ్యభిచారంను నడుపుతున్నారు కొందరు ప్రముఖులు. ఇక కస్టమర్లు కూడా అంతే స్థాయిలో వస్తారు. ఏరి కోరిన అమ్మాయిలను సప్లయ్ చేసి కస్టమర్ల నుంచి డబ్బులు దన్నుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఓ సెక్స్ రాకెట్ నడుపుతున్న హోటల్ పై పోలీసులు దాడులు చేశారు.
ముంబైలోని కాస్లీ ఏరియా అయిన జూహూ ప్రాంతంలో ఉన్న జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ వ్యభిచారం చేయిస్తున్నది బాలీవుడు ప్రొడక్షన్ మేనేజర్ రాజేష్ కుమార్ లాల్. పోలీసులు దాడి చేసే సమయానికి రాజేష్ కుమార్ లాల్ అక్కడే ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఇక వ్యభిచారంలో పట్టుబడిన యువతులు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

గతేడాది డిసెంబర్ 23వ తేదీన కూడా ఇదే హోటల్‌పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువతులను కాపాడారు. అప్పడు కూడా వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతోనే పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న జరీనా అనే మహిళ భారత్‌లో ఈ సెక్స్ రాకెట్‌ను నడుపుతోందని పోలీసులు చెప్పారు. ఇందుకు రాజేష్ కుమార్ లాల్ సహకారం తీసుకుందని చెప్పారు. అవసరమైనప్పుడు ఉజ్బెకిస్తాన్ మహిళలను ముంబైకి పంపుతుందని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఇక విటులు కూడా బడాబాబులే అని పోలీసులు తెలిపారు.
ఒక యువతితో ఒక రాత్రి గడపాలంటే రూ.80వేలు చెల్లిస్తున్నారని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఇక రాజేష్ కుమార్ లాల్ పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జరీనా ఉజ్బెకిస్తాన్‌లో ఉందని ఆమెను కూడా భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
-
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications