సెక్స్ రాకెట్ : బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్..
సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి అతను వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. పోలీసులు పక్కా సమాచారంతో ఓ లగ్జరీ హోటల్‌పై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని చెరలో ఉన్న పలువురు విదేశీ వనితలకు విముక్తి కల్పించారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు మోపి దర్యాప్తు ప్రారంభించారు.

ఎవరా ప్రొడక్షన్ మేనేజర్
బాలీవుడ్‌కి చెందిన రాజేష్ కుమార్ లాల్ అనే ప్రొడక్షన్ మేనేజర్‌ను ముంబై జుహులోని జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హోటల్‌పై దాడులు చేసిన పోలీసులు రాజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని చెర నుంచి ఇద్దరు ఉజ్బెకిస్తాన్ మహిళలను విడిపించారు.

ఉజ్బెకిస్తాన్ మహిళ..
రాజేష్ కుమార్ లాల్ నిర్వహిస్తున్న ఈ సెక్స్ రాకెట్‌కి ఉజ్బెకిస్తాన్‌కి చెందిన జరీనా అనే మహిళ విదేశీ అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచే ఆమె అమ్మాయిలను ముంబైకి పంపిస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఒక్కో కస్టమర్ వద్ద నుంచి రూ.80వేలు వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.

మహిళల అక్రమ రవాణా :
క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దీనిపై సమాచారం అందడంతో ఓ స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. హోటల్‌పై దాడి చేసి నిర్వాహకుడైన రాజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుంది.నిందితుడు రాజేష్ కుమార్‌పై పోలీసులు పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంతో పాటు వ్యభిచార కేసులు నమోదు చేశారు.

గత నెలలో ఇలాంటి తరహా ముఠా గుట్టురట్టు..
గత డిసెంబర్ 23న పోలీసులు ఇలాంటిదే మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. సెల్‌ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా జుహులోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ముగ్గురు అమ్మాయిలను వారి చెర నుంచి విడిపించారు. ఈ దందా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి జయేశ్ బోరా అలియాస్ టోనీ కోసం అన్వేషిస్తున్నారు.
-
మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications