రాధే మాకు తారల మద్దతు, వ్యతిరేకత (ఫోటోలు)
ముంబై: అధ్యాత్మిక దేవత రాధే మా (గాడ్ వూమెన్)కు బాలీవుడ్ లో కొందరు ప్రముఖులు మద్దతు ఇస్తుంటే కొందరు ఆమె మీద మండిపడుతున్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని రాధే మా కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు.
భక్తుల ముందు ఒక విధంగా విదేశాలలో మిని స్కర్ట్ లు వేసుకుని ఒక విధంగా నటిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి నకిలి ఆధ్యాత్మిక గురువుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు బాలీవుడ్ ప్రముఖులు రాధే మాకు మద్దతు ఇస్తున్నారు.
1975లో బాలీవుడ్ లో విడుదలై ఘనవిజయం సాధించిన జై సంతోషి మా సినిమా గుర్తు చేస్తున్నారు. జై సంతోషి మా సినిమా లాగా ఇప్పుడు రాధే మా పాపులర్ కావడానికి ఈ అవతారం ఎత్తారని అంటున్నారు. షోలే, దివార్ సినిమాలతో పోటి పడి సంతోషి మా సినిమా కలెక్షలు వసూలు చేసింది. రాధే మా జీవిత చరిత్ర ఆదారంగా సినిమా తియ్యడానికి బాలీవుడ్ లో నిర్మాతలు క్యూ కడుతున్నారు.

రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్
రాధే మాకు వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె కొని సమస్యల కారణంగా రాధే మా అవతారం ఎత్తారు.

కేసు నుండి తప్పించుకోవాలని
రాధే మా మీద ముంబైలోని కండ్లివి పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేదింపుల కేసు నమోదు అయ్యింది. పోలీసులు రాధే మా పేరును నిందితుల జాబితాలో చేర్చారు.

మిని స్కర్ట్ ఫోటోలు తెచ్చిన తంటా
కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ రాధే మా మిని స్కర్ట్ లు వేసుకున్న ఫోటోలు బయటపెట్టడంతో వివాదం చెలరేగింది.

నీలి చిత్రాల సుందరి మద్దతు
నీలి చిత్రాలలో నటించి బాలీవుడ్ లో అడుగు పెట్టిన సన్నీ లియోన్ తెలియని వారు ఉండరు. ఈమె రాధే మా అంటే తనకు చాల గౌరవం, ఆమె ఆశీర్వాదం వలన తాను ముందుకు వెళుతున్నానని చెప్పడం విశేషం.

నేనేం తక్కువ కాదు
రాధే మాకు బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ మద్దతు తెలిపింది. రాధే మాను వేధిస్తున్న వారికి తగిన బుద్ది చెబుతామని మండిపడ్డారు. రాధే మా చాల గ్రేట్ అన్నారు.

సంచలనాల దర్శకుడు
సంచలనమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు, నిర్మాత సుభాష్ ఘాయ్ రాధే మాకు పరమ భక్తుడు. రాధే మా ఎలాంటి తప్పు చెయ్యలేదని ఆయన వెనకేసుకువస్తున్నారు.

మాజీ భక్తురాలు డాలీ బింద్రా
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ రియాలిటి షోలో నటించిన డాలీ బింద్రా ఒకప్పుడు రాధే మా భక్తురాలు, ఇప్పుడు రాధే మా మీద ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని రాధే మా, ఆమె భక్తులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మల్లికా షెరావత్ తో సినిమా అన్నారు
రాధే మా జీవిత చరిత్ర ఆధారంగా రాధే మా పాత్రలో బాలీవుడ్ నటి మల్లికా షరావత్ తో సినిమా తియ్యడానికి ఒక నిర్మాత సిద్దం అయ్యాడు. అయితే మల్లికా షరావత్ ఇప్పటి వరకు ఎస్ అని చెప్పలేదు.

సోనూ నిగమ్
బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాధే మాకు పరోక్షంగా మద్దతు పలికాడు. పలువురు సాధువుల మీద ఆరోపణలు చేశాడు. రాధే మా భక్తుల మీద మొదట కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు.

పంజాబ్ విషాదం
పంజాబ్ లోని కుటుంబ సభ్యులు రాధే మాను నమ్ముకుని వారి ఆస్తి మొత్తం ఆమెకు ఇచ్చారని, తరువాత పరిస్థితులలో మార్పు రాలేదని ఆ కుటుంబంలోని 7గురు ఆత్మహత్య చేసుకున్నారని కేసు నమోదు అయ్యింది.

మిని స్కర్ట్ లు వేసుకుంటే తప్పు లేదు
ఇటివల మీడియాతో మాట్లాడిన రాధే తమ ఇంటిలో కురచ దుస్తులు వేసుకుంటే తప్పు లేదని ఆమె సమర్థించుకున్నారు.

రాజీకి ప్రయత్నిస్తున్న ప్రముఖులు
వరకట్నం వేధింపుల కేసు పెట్టిన నిక్కీ తో చర్చలు జరపడానికి పలువురు పెద్దలు రంగంలోకి దిగారు. ఆ కేసు నుండి రాధే మా పేరు తొలగించడానికి సహకరించాలని నిక్కికి మనవి చేస్తున్నారు.
-
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
రణవీర్ సింగ్ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications