Aryan Khan: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన బాలీవుడ్ బాద్‌షా కుమారుడు

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పరువు కోల్పోయిన హిందీ చలన చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలిపించారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంతో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగుతుండగానే.. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హై ప్రొఫైల్ రేవ్ పార్టీని ఎన్సీబీ అధికారులు భగ్నం చేశారు.

లగ్జరీ షిప్‌లో రేవ్ పార్టీ..

ముంబై సముద్ర తీర ప్రాంతంలో ఓ లగ్జరీ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. హైప్రొఫైల్ రేవ్ పార్టీ ఇది. ఓ విలాసవంతమైన షిప్‌లో దీన్ని ఆర్గనైజ్ చేశారంటే.. ఎన్ని కోట్ల రూపాయలను దీని మీద ఖర్చు చేసి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. నిషేధిత డ్రగ్స్ అన్నీ భారీ స్థాయిలో లభించాయి ఈ షిప్‌లో. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్షల రూపాయల్లో నగదు మొత్తాన్ని సీజ్ చేశారు.

బాలీవుడ్ బాద్‌షా కుమారుడు

అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్స్ ఎంప్రెస్ షిప్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతణ్ని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన వారిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 13 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. ఈ ముగ్గురూ ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి కొకైన్, హషీష్, ఎండీఎంఏను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేశారు.

న్యాయస్థానం ముందు హాజరు..

అరెస్ట్ చేసిన వారందరినీ ఎన్సీబీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అలాగే- క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీని నిర్వహించిన మొత్తం ఆరుమందికి నార్కొటిక్స్ బ్యూరో అధికారులు సమన్లను జారీ చేశారు. ఈ మధ్యాహ్నానికి విచారణ కోసం తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో మరింత మందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెర మీదికి వచ్చినట్టయింది.

ఆర్యన్ ఖాన్ ఫోన్ సీజ్

ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌ను ఎన్సీబీ అధికారు స్వాధీనం చేసుకున్నారు. పాస్‌వర్డ్‌తో దాన్ని ఓపెన్ చేశారు. కాల్ లిస్ట్ ఆధారంగా ఓ జాబితాను ప్రిపేర్ చేస్తోన్నట్లు చెబుతున్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన టెక్స్ట్ మెసేజీలు, వాట్సప్ చాటింగ్స్, ఫోన్ కాల్స్.. ఇలా అన్నింటినీ వారు స్కాన్ చేస్తోన్నారని సమాచారం. దీని ఆధారంగా మరి కొంతమంది బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలను విచారణకు పిలిపించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినందున వారికి అవి ఎక్కడి నుంచి లభించాయి? డ్రగ్ పెడ్లర్ ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.

వ్యాపారవేత్తల కుమార్తెలు ఉన్నారా?

రేవ్ పార్టీ సందర్భంగా నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన ముగ్గురు యువతులు ఢిల్లీ నుంచి వచ్చినట్లు నిరూపితమైంది. ప్రముఖ వ్యాపార వేత్తల కుమార్తెలని చెబుతున్నారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి అదే పనిగా ఢిల్లీ నుంచి వచ్చారని తెలుస్తోంది. వారి పూర్తి వివరాలను బయట పెట్టడానికి ఎన్సీబీ అధికారులు నిరాకరిస్తున్నారని అంటున్నారు. విచారణ పూర్తయిన తరువాత.. డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలితేనే వారి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మెరుపుదాడికి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే స్వయంగా సారథ్యం వహించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్సీబీ అధికారులు ప్రత్యేక బోట్లల్లో షిప్‌కు చేరుకుని, రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఏడు గంటల పాటు ఈ మిషన్ కొనసాగింది.

ఎన్డీపీఎస్ యాక్ట్ కింద

రేవ్ పార్టీ నిర్వాహకులు, అందులో పాల్గొన్న వారందరూ నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. వారిని ఇవ్వాళ న్యాయస్థానం ముందు హాజరు పర్చనున్నారు. రిమాండ్‌లోకి తీసుకున్న తరువాత వారిని సెక్షన్ 67 కింద విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన సమాచారం తెలుసుకున్న వెంటనే టాప్ క్రిమినల్ లాయర్ ఆనందిని ఫెర్నాండెజ్ ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారని, ఇద్దరిని విడిపించుకుని తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

మ్యూజికల్ నైట్ కోసం..

నిజానికి- ఓ మ్యూజికల్ నైట్‌ను నిర్వహించడానికి ఈ క్రూయిజ్ లైనర్‌ను అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. శని, ఆది, సోమ వారాల్లో మ్యూజికల్ వోయెజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, వందలాది టికెట్లు సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఈ మ్యూజికల్ వోయెజ్ ప్రోగ్రామ్ కోసం విక్రయించిన టికెట్ల ధర లక్ష రూపాయల వరకు ఉందని అంటున్నారు. కొందరు సెలెబ్రిటీలకు మాత్రమే ఈ టికెట్లను విక్రయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+