Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya:రామమందిరం నిర్మాణంకు కదిలిన అక్షయ్ కుమార్..భారీగా విరాళం ఎంతంటే..?

ముంబై: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం అంత తమవంతు సహాయం చేయాలని, ఇందులో భాగంగా విరాళాలు ఇవ్వాలని కోరుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అయోధ్య రామమందిరం నిర్మాణంకు తనవంతుగా కొంత విరాళం ఇవ్వగా తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా తన బాధ్యత నిర్వర్తించాడు.

అయోధ్య రామమందిరం నిర్మాణంకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంకు తమ వంతుగా విరాళాలు ఇచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు అక్షయ్ కుమార్. ఓ వీడియో విడుదల చేసిన అక్షయ్ కుమార్ చివరిగా జైశ్రీరాం నినాదం ఇచ్చాడు. ఇదిలా ఉంటే గతేడాది ఆగష్టులో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం నిర్మాణంకు భూమిపూజ జరిగింది.

Bollywood superstar Akshay Kumar donates to Ayodhya Ram temple construction,Details here

ఇక కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసి తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ మేరకు చెక్ ఆ బృందానికి అందజేశారు రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు దేశీయ విరాళాల ద్వారానే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. సాధారణ ప్రజలు ఇచ్చే విరాళాల సేకరణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు ట్రస్టు అనుమతి లేదని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.

ఇప్పటికే లార్సన్ అండ్ టూబ్రోతో పాటు సీబీఆర్‌ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఇంజినీర్లు మట్టి సారంను పరీక్షించడంతో రామజన్మభూమి నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైందని ట్రస్టు సభ్యులు చెప్పారు. 36 నెలల నుంచి 40 నెలల సమయంలో రామమందిరం ఏర్పాటు పూర్తవుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+