బిజెపి కార్యాలయంపై బాంబు దాడి: ఒకరికి గాయాలు
దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది.
ఆదివారం ఉదయం జరిగిన ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దుండగులు బాంబు విసిరి వెంటనే పారిపోయినట్లు వారు పేర్కొన్నారు.

నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బాంబు దాడులు పలు పార్టీల కార్యాలయాలపై జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications