ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్!
Bomb Threat: ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. ఆ బెదిరింపు నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో భద్రతను పెంచారు. విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం భద్రతా దళాలు ఈ బెదిరింపు పంపిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం 6E 762ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఎయిర్‌లైన్, ఎయిర్పోర్టు భద్రతా ఏజెన్సీలు తక్షణమే అలర్ట్ ప్రకటించి భద్రతను పటిష్టం చేశాయి. ఈ విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బెదిరింపు అందిన వెంటనే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సమాచారం.

ఇండిగో స్పందన
ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఇండిగో ప్రతినిధి స్పందిస్తూ.. "సెప్టెంబర్ 30, 2025న ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం 6E 762లో భద్రతకు సంబంధించిన ముప్పు ఉన్నట్లు గుర్తించాం. నిర్దేశించిన ప్రోటోకాల్‌లను అనుసరించి, మేము వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఆ తర్వాత విమానం ఆపరేషన్లకు సిద్ధంగా ఉందని ధ్రువీకరించే ముందు అవసరమైన భద్రతా తనిఖీలను నిర్వహించడంలో వారికి పూర్తి సహకారం అందించాం" అని వెల్లడించారు.
పదే పదే వస్తున్న బెదిరింపులు
గత కొంతకాలంగా ఢిల్లీలో విద్యా సంస్థలకు, ముఖ్య ప్రదేశాలకు పదే పదే బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపు వచ్చింది. అయితే రాజధానితో పాటు ఎన్‌సీఆర్‌లో వచ్చిన ఇటువంటి బెదిరింపులన్నీ దాదాపుగా తప్పుడు వార్తలు, పుకార్లుగా తేలాయి.ఈ తాజా బెదిరింపు కూడా ఓ పుకారుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బెదిరింపు పంపిన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. అయినప్పటికీ, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండి, విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications