మహిళను మరో మహిళ లైంగికంగా వేధిస్తుందా?: కోర్టు

భారత శిక్షాస్మృతి 354వ సెక్షన్ కింద లైంగిక వేధిపుల ఆరోపణలపై ఒక మహిళ మరొక మహిళపై ఆరోపణలు చేయొచ్చా? అని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఒకవేళ ఒక మహిళపై మరొక మహిళ అలాంటి ఆరోపణలు చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చా అని జస్టిస్ ఎస్‌హెచ్ నరేష్ పాటిల్, జస్టిస్ విఎల్ అచిలియాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
చట్టంలో పరిస్థితి ఏమిటనేది పరిశీలించి రెండు వారాల తర్వాత పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. కేసు విషయంలోకి వెళితే.. అక్టోబర్ 23, 2009లో సర్లబెన్ షా (78) కుటుంబం, ప్రీతా జైన్ (55) కుటుంబాలు ముంబైలోని శివారు ప్రాంతంలో ఇరుగుపొరుగున నివసిస్తున్న సమయంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో సర్లబెన్ మనవరాలు వేధింపులకు గురైంది. దీంతో ఆమె జైన్ కుటుంబంపై లైంగిక వేధింపుల పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత 2010, ఫిబ్రవరి 27న జైన్ కుటుంబ సభ్యులు కూడా తమపై సర్లబెన్ షా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేయబడ్డాయి. షా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. 78ఏళ్ల షా మరో మహిళపై ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడగలదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు, ఒక మహిళపై మరో మహిళ లైంగిక వేధింపులకు పాల్పడే ఆరోపణలు చేయవచ్చా? అనేదానిపై పరిశీలించి పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications