వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోన్‌లెస్-రూడ్: కమల్, సుబ్రమణ్యస్వామి మధ్య పచ్చగడ్డి మండేలావుంది!

తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మధ్యలో పచ్చగడ్డి వేస్తే మండేలా చేస్తున్నాయి. కాగా, వారిద్దరూ కూడా చెన్నైలోనే ఉంటారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మధ్యలో పచ్చగడ్డి వేస్తే మండేలా చేస్తున్నాయి. కాగా, వారిద్దరూ కూడా చెన్నైలోనే ఉంటారు. అంతేగాక, వారి ఇళ్ల మధ్య దూరం మూడు కిలో మీటర్లే కావడం గమనార్హం.

అయితే, ఇప్పుడు మాత్రం కమల్, స్వామి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. కమల్‌ను విమర్శిస్తూ స్వామి ట్వీట్‌ చేసిన మరు క్షణంలోనే కమల్‌ కూడా అంతే స్థాయిలో స్పందించారు.

అసలు వీరిద్దరి మధ్య గొడవెలా వచ్చిందంటే ఓ ట్విట్టర్‌ ఖాతాదారుడు సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నిస్తూ.. కమల్‌ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాన్ని బీజేపీ ఆహ్వానిస్తుందా? అని అడగగా... బీజేపీ సంగతి తెలియదుగానీ, తాను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పారు. 'బోన్‌లెస్‌ వండర్‌, డంబాలకు పోయే ఇడియట్‌ కమల్‌' అంటూ ట్వీట్‌ చేశారు సుబ్రమణ్య స్వామి.

దీంతో చిర్రెత్తుకొచ్చిన కమల్‌.. వెంటనే అదే స్థాయిలో ట్వీట్‌ చేశారు. తనకు ఒక అంశంపై మొండిగా పోరాడే తత్వం ఉందని, అది మాత్రం చాలు అని చెప్పారు. అంతేగాక, 'సంతోషం.. సుబ్రహ్మణ్యస్వామి తమిళులను ఎలా పిలుస్తారో ఆయనకు తెలుసు. నేనెప్పుడు ఆయనను వ్యతిరేకించను.. ప్రజలే ఆ పనిచేస్తారు. స్వామి ఓ కరడు వ్యక్తిత్వం ఉన్నవ్యక్తి. ఆయనకు నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ కమల్‌ ఒక వైపు మర్యాదిస్తూనే చురకంటించారు.

కమలహాసన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు

కమలహాసన్‌ విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టి అల్లర్లను ప్రేరేపించే విధంగా తన ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియ దేశీయ లీగ్‌ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా అద్యక్షుడు ఫిర్దౌస్‌ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమల్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర శాసనసభ్యులకు వ్యతిరేకంగాను, అల్లర్లను ప్రేరేపించే విధంగాను ఉన్నాయన్నారు. ఈ కారణంగా ఆయనపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలన్నారు.

English summary
They live less than 3km from each other in Chennai. But that gap is threatening to get as tense as 3km on either side of the border of two hostile nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X