బోర్డర్ స్టాండఫ్: ప్యాంగ్యాంగ్ త్సో లేక్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ మొదలు
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా ముందడుగు వేశాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు డ్రాగన్ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ యూ కియాన్ తెలిపారు.
కాగా, ఈ అంశంపై భారత్ వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. 9వ రౌండ్ కమాండర్ స్థాయి చర్చల్లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత సాయుధ దళాలు బుధవారం నుంచి ప్యాంగ్యాంగ్ నుంచి వెనక్కి రావడం ప్రారంభించాయని యూ కియాన్ పేర్కొన్నారు.

గత తొమ్మిది నెలలుగా చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు భారత్.. చైనాతో చర్చలు జరుపుతూనే ఉంది. తాజాగా, చైనా తన బలగాల ఉపసంహరణకు అంగీకరించడంతో ముందడుగు పడింది.
కాగా, 'ప్రణాళిక ప్రకారం, చైనా ఫింగర్ 8 నుంచి తిరిగి వెళుతుంది, భారత దళాలు ఫింగర్ 2, 3 మధ్య ధన్ సింగ్ థాపా పోస్టుకు తిరిగి కదులుతాయి. ఫింగర్ 4 వరకు రెండు వైపులా పెట్రోలింగ్ జరగదు. ఇది దశలవారీగా జరుగుతుంది' సంబంధిత వర్గాలు చెప్పారు.
Chinese and #Indian border troops on the southern and northern shores of #Pangong Lake began disengagement as planned on Wednesday according to the consensus reached during the ninth round of military commander-level talks: China's Ministry of National Defense pic.twitter.com/Af6NhoFjz3
— Global Times (@globaltimesnews) February 10, 2021
9వ రౌండ్ సైనిక చర్చలలో ఏమి జరిగింది?
గత నెలలో తొమ్మిదవ రౌండ్ సైనిక చర్చలలో, 16 గంటలకు పైగా సాగాయి. భారతదేశం.. చైనా దళాలను ముందస్తుగా ఉపసంహరించడానికి అంగీకరించాయి. తూర్పు లడఖ్‌లో పరిస్థితిని స్థిరీకరించడానికి, నియంత్రించడానికి "సమర్థవంతమైన ప్రయత్నాలను" కొనసాగించాలని సంకల్పించాయి.
'ఫ్రంట్‌లైన్ దళాలను ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. వారు తమ నాయకుల ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని అనుసరించడానికి, సంభాషణ, చర్చల మంచి వేగాన్ని కొనసాగించడానికి, కార్ప్స్ కమాండర్ స్థాయి 10 వ రౌండ్స్ సమావేశం నిర్వహించడానికి అంగీకరించారు. దీంతో తేదీ కంటే ముందే ఉపసంహరణ ప్రారంభమైంది' అని ప్రకటన తెలిపింది.