హీరో, నిర్మాత కొంప ముంచిన సినిమా, కురుక్షేత్ర శాపంగా మారిందా ?, ఏం జరిగింది ?

శ్యాండిల్ వుడ్ లో 2019లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం కురుక్షేత్ర సినిమా. లెజెండరీ వార్ మూవీని త్రీడీలో ప్రముఖ నిర్మాత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అలియాస్ మునిరత్న నాయుడు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కురువంశానికి అధిపతి అయిన దుర్యోధనుడిగా శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ నటించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న విషయం కూడా తెలిసిందే.

ఇప్పుడు కురుక్షేత్ర సినిమాకు సంబంధించిన హీరో, ఆ సినిమా నిర్మత ఇద్దరూ కూడా సెంట్రల్ జైల్లో ఉండటం ఆశ్చర్యకరం కలిగిస్తోంది. అంటే కురుక్షేత్ర సినిమా ఆ సినిమా హీరోకు, నిర్మాతకు ఐదు సంవత్సరాల తరువాత శాపం అయ్యిందని శ్యాండిల్ వుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు అంటున్నారు. కురుక్షేత్ర సినిమా తియ్యడం వలనే ఆ సినిమా హీరో, నిర్మాతలు ఇద్దరూ జైలుకెళ్లడానికి కారణమా ? అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

Both the producer of Kurukshetra Kannada movie and the hero of that movie are now in Central Jail

కురుక్షేత్ర నిర్మాత, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను జైలుకు పంపించారు. కులం పేరుతో దూషించారని, చంపేస్తానని బెదిరించారని నమోదు అయిన కేసుల్లో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ విషయంపై కర్ణాటకలో రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు బురదజల్లుకుంటున్నారు. ఈ రాజకీయాలను పక్కన పెడితే బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత.

అంతే కాకుండా గతంలో మునిరత్న నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2002లో ఓ చిత్రాన్ని నిర్మించడం ద్వారా గాంధీనగర్‌లోకి అడుగుపెట్టిన మునిరత్న శ్యాండిల్‌వుడ్‌లోని చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించారు. ఉపేంద్ర నటించిన రక్తకన్నీరు, కఠారివీర, సురసుందరాంగి తదితర చిత్రాలకు మునిరత్న నిర్మాత.

Both the producer of Kurukshetra Kannada movie and the hero of that movie are now in Central Jail

2019లో మునిరత్న కురుక్షేత్ర అనే పేరుతో పురాణ యుద్ధ కథను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు.

కురుక్షేత్ర సినిమాలో హీరో దర్శన్ దుర్యోధనుడిగా నటించారు. బహుభాషా నటీనటులు, త్రీడీ టెక్నాలజీ తీసిన కురుక్షేత్ర సినిమా అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది. కురుక్షేత్ర భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ కురుక్షేత్రం నిర్మాత మునిరత్న, ఆ సినిమా హీరో దర్శన్ ఇద్దరూ కూడా జైలుకు వెళ్లారు.

రేణుకాస్వామి హత్య కేసులో మూడు నెలలుగా హీరో దర్శన్ జైలులో ఉండగా, బీజేపీ ఎమ్మెల్యే, కురుక్షేత్ర సినిమా నిర్మాత మునిరత్న ఓ వ్యక్తిని చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపణలు రావడంతో నమోదు అయిన కేసుల్లో జైలులో ఉన్నాడు.

కురుక్షేత్ర నాటకం వేస్తేనే కళాకారులు, ఆ నాటకం నిర్వాహకులు ఇబ్బందులు పడతారని కర్ణాటక ఓ సామెత ఉంది.

ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా అదే వినిపిస్తోంది. కురుక్షేత్రం సినిమా నిర్మాత మునిరత్నకు, హీరో దర్శన్ కు కురుక్షేత్ర సినిమా శాపంగా మారిందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కురుక్షేత్ర సినిమాకు సంబంధించి ఆ సినిమా హీరో దర్శన్, నిర్మాత మునిరత్న ఇద్దరూ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లడం కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. శ్యాండిల్ వుడ్ తో పాటు కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు కురుక్షేత్ర సినిమాపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+