స్నేహితులు చేసిన ఆకతాయి పని... ప్రాణాలు వదిలిన ఆరేళ్ల చిన్నారి...

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇండోర్‌లో స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డారు. ఆటలో భాగంగా ఫ్రెండ్స్ చేసిన ఆకతాయి పని బాలుడి మరణానికి కారణమైంది. కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు.

స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి

స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి

ఇండోర్‌కు చెందిన రామచంద్ర యాదవ్‌ పాల్దా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అతనికి ఆరేళ్ల వయసు గల కన్హా యాదవ్ అనే కొడుకున్నాడు. ఆదివారం ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కాసేపటికి పొట్ట భారీగా ఉబ్బిపోయి ఇబ్బందిపడుతూ స్నేహితుల సాయంతో ఇంటికి వచ్చాడు. కొడుకు పరిస్థితిని చూసి ఆందోలన చెందిన తల్లిదండ్రులు వెంటనే మహారాజ యశ్వంత్ రావ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌కు చేరుకునే లోపే ఆ చిన్నారి కన్నుమూశాడు

ఎయిర్ కంప్రెసర్‌తో కడుపులోకి గాలి

ఎయిర్ కంప్రెసర్‌తో కడుపులోకి గాలి

కన్హ యాదవ్ చనిపోవడానికి కారణం తెలుసుకుని తల్లిదండ్రులు షాకయ్యారు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కన్హా యాదవ్‌ మలద్వారంలో ఎయిర్ కంప్రెసర్ నాజిల్ పెట్టిన అతని స్నేహితుడు గాలిని పంప్ చేశాడు. దీంతో చిన్నారి కడుపులోకి గాలి చేరి ఉబ్బిపోయింది. పొట్టలో ఒత్తిడి ఎక్కువై కన్హా యాదవ్ మృత్యువాతపడ్డాడు. చిన్నారులు చేసిన ఆకతాయి పని కారణంగా తమ కొడుకు చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు.

 పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కచ్చితమైన కారణం

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కచ్చితమైన కారణం

బాలుడు మృతి విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంంపారు. అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని డాక్టర్లు చెప్పారు. బాలుడి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+