టిక్‌టాక్‌కు మరొకరు బలి.. చేతులకు గాజులు.. మెడలో మంగళసూత్రం వేసుకుని..
కోటా : టిక్‌టాక్.. అన్ని వయసుల వారిని విపరీతంగా ఆకట్టుకుంటున్న షార్ట్ వీడియో యాప్. పిల్లలు, పెద్దలు, ఆడ, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టిక్‌టాక్ కాపురాల్లో చిచ్చుపెట్టడమే కాదు... పబ్లిసిటీ కోసం డేంజరస్ స్టంట్లు చేసే వారిని హాస్పిటల్ పాలు చేస్తోంది. యాప్‌కు బానిసై ప్రాణాలు తీసుకుంటున్న వారికి లెక్కలేదు. తాజాగా రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. టిక్‌టాక్ వీడియో చేస్తూ ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం విధించాడు.
Recommended Video


గాజులు, మంగళసూత్రం వేసుకుని
రాజస్థాన్ కోటాకు చెందిన ఓ పన్నెండేళ్ల బాలుడు టిక్ టాక్‌కు బానిసయ్యాడు. పగలు రాత్రి తేడా లేకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. టిక్ టాక్ ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలుడు చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం ధరించాడు. అనంతరం బాత్‌రూంలోకి వెళ్లి చెయిన్‌తో ఉరివేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం కొడుకు ఎంతసేపటికీ తన రూం లోంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తెరిచిచూడగా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. సీలింగ్‌కు వేలాడుతున్న కొడుకును దింపి దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

భర్త మందలించాడని ఆత్మహత్య
పది రోజుల క్రితం తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య తరచూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ పిల్లల్ని పట్టించుకోవట్లేదని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనిత అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేసి ప్రాణాలు వదిలింది.

ట్రీట్‌మెంట్‌కు పది లక్షలు
తాజాగా కర్నాటకకు చెందిన ఓ యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేందుకు వీడియో తీస్తూ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. కర్నాటక తుమకూరులో ఆర్కెస్ట్రా గ్రూప్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కుమార్ అనే యువకుడు బ్యాక్ జంప్ చేస్తూ అదుపుతప్పి గాయాలపాలయ్యాడు. శరీరం బరువు మెడపై పడటంతో అతని వెన్నెముక విరిగింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతనికి సర్జరీ చేసేందుకు రూ.10లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆ మొత్తం ఎక్కడి నుంచి తేవాలో తెలియక కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications