ప్రియురాల్ని చంపిన ప్రియుడు, కొట్టి చంపిన బంధువులు

ఈ బాలికకు అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సిన్ రాజుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో బాలికను ఆమె పెద్దలు మందలించారు. మంగళవారం ఇద్దరు కనిపించకుండా పోయారు.
ప్రియురాలి తల్లిదండ్రులు, బంధువులు పలుచోట్ల వెదికారు. ఫలితం లేకుండా పోయింది. అయితే, బుధవారం ఉదయం సిన్ రాజు ఒక్కడే గ్రామానికి వచ్చాడు. అతడిని అందరు నిలదీశారు. బాలిక ఎక్కడ అని అడిగారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉందని చెప్పాడు.
తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు వెళ్లి చూడగా ఆమె కాలిన స్థితిలో శవమై కనిపించింది. దీంతో అగ్రహానికి గురైన బాలిక బంధువులు సిన్ రాజును తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సిన్ రాజు అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచాడు.


Click it and Unblock the Notifications