లవ్ మ్యారేజ్, ప్రియురాలి న్యూడ్ వీడియోలు వైరల్ చేసి లాడ్జ్ లో ఏం చేశాడంటే !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని ఓ లాడ్జిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన యువకుడిని శశిధర్‌గా గుర్తించారు. కర్ణాటకలోని విజయపూర్ జిల్లా బసవన్ బాగేవాడిలో శశిధర్ నివాసం ఉంటున్నాడు. మృతుడు శశిధర్ మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శశిధర్‌పై బాలిక తల్లిదండ్రులు బసవన్ బాగేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు శశిధర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శశిధర్‌ను అరెస్ట్ చెయ్యడానికి ప్రయత్నించడంతో అతను పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న శశిధర్ బెంగళూరు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. బెంగళూరు నగరంలోని కాటన్ టౌన్‌లోని గజాననా లాడ్జిలో శశిధర్ ఒక గది అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం రాత్రి శశిధర్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 girlfriend cheated on love marriage.

బుధవారం లాడ్జి సిబ్బంది గదికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. శశిధర్ ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. ఆరేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు నా చావుకి తన భార్య తండ్రి, అమ్మ, మామ, అమ్మమ్మ కారణం అని, ప్రేమ పెళ్లిని వ్యతిరేకించడం సమాజమే అని, అయితే పెళ్లి జరిగిన తరువాత తన ప్రియురాలు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని శశిధర్ అతని మొబైలో స్టేటస్ పెట్టాడు.

పోలీసులు నా ఫిర్యాదును పట్టించుకోలేదని, నా బాధను అర్థం చేసుకోలేదని, పోలీసుల మీద విచారణ జరగాలని స్టేటస్ పెట్టిన శశిధర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయపర జిల్లా బసవన్ బాగేవాడి తాలూకా వాడవాడగి గ్రామానికి చెందిన శశిధర్ అనే యువకుడు తన ప్రియురాలి న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిన తరువాత బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

శశిధర్ అతని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లో అతని ప్రియురాలితో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ రాసలీలలు సాగిస్తున్న సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీశాడు. లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమైన ఇద్దరు వ్యక్తుల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన తరువాత శశిధర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

 girlfriend cheated on love marriage.

6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న శశిధర తరువాత అతని మైనర్‌ భార్యను తీసుకొచ్చి బెంగళూరులో కాపురం పెట్టాడు. అయితే యువతి తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించి శశిధర్ మీద కేసు పెట్టడంతో ఇంత జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. శశిధర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+