ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ !

ముంబాయి/బెంగళూరు: సహజీవనం చేస్తున్న మహిళను 20 ముక్కలుగా నరికేసి ఆమె శరీరంలోని భాగాలను కుక్కర్ లో వేసి ఉడకబెట్టిన నిందితుడి గురించి కలకలం రేపే విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు మనోజ్ సానే (56) అతను హత్య చేసిన సరస్వతి వైద్య అలియాస్ సరస్వతిని (32)లు వివాహం చేసుకున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

అయితే మనోజ్, సరస్వతిల మధ్య విపరీతమైన ఏజ్ గ్యాప్ ఉండటంతో పెళ్లి విషయాన్ని ఇద్దరూ గోప్యంగా ఉంచారనే విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అతనితో 9 ఏళ్లుగా సహజీవనం చేసిన సరస్వతిని హత్య చేసి మృతదేహాన్ని 20కి పైగా ముక్కలు చేసిన మనోజ్ కుక్కర్ లో వండిన ఘటనపై పోలీసులు లోతుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 deadbodys

పోలీసుల విచారణలో సరస్వతి ముగ్గురు సోదరీమణులు వాంగ్మూలం ఇచ్చారు, హత్యకు గురైన సరస్వతి వైద్య, నిందితుడు మనోజ్ సానే కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. కానీ వీళ్ల పెళ్లి రిజిస్టర్ కార్యాలయంలో నమోదు కాలేదు. మనోజ్, సరస్వతిల మధ్య వయసులో 24 ఏళ్లు తేడా ఉండటంతో తమ పెళ్లిని ఇతరులకు తెలియకుండా దాచిపెట్టారని మీరా-భయందర్ విభాగం డీసీపీ జయంత్ బజ్బలే మీడియాకు చెప్పారు.

ముంబాయిలోని మీరారోడ్ అపార్ట్‌మెంట్‌లో లైవ్ ఇన్ పార్ట్‌నర్ సరస్వతి వైద్యను హంతకుడు మనోజ్ సానే హత్య చేయడంపై పొరుగువారు శుక్రవారం మీడియాకు వివరణ ఇచ్చారు.జూన్ 6న అపార్ట్‌మెంట్‌లో ఎలుకలు చనిపోయినట్లు వచ్చే దుర్వాసన వచ్చిందని అపార్ట్‌మెంట్ మొత్తం వెతికినా ఏమీ దొరకలేదని, మనోజ్ ఇంటి తలుపు మూసి ఉండటంతో మాకు అతని మీద అనుమానం వచ్చిందని చెప్పారు.

 love-affair

అందుకే వాళ్ల ఫ్లాట్ లో ఏమైనా జరిగిందా అని అడిగేసరికి మనోజ్ తలుపు తీయలేదు. కానీ అతని ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ శబ్దం వినిపించిందని అన్నారు. మనోజ్ ఇంటి నుంచి దుర్వాసన కూడా వచ్చిందని పక్కింటిలో నివాసం ఉంటున్న అనూ శ్రీవాస్తవ, నీరజ్ శ్రీవాస్తవ పోలీసులకు, మీడియాకు చెప్పారు. మేము మనోజ్ ను లిఫ్ట్‌లో చూసినప్పుడు అతను ముఖానికి మాస్క్ వేసుకున్నాడని, అతని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయని, మమ్మల్ని చూసి అతను వణుకుతున్నాడని, అప్పుడు మేము అతనిని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చామని, పోలీసులు వచ్చి తలుపులు తీయగా సరస్వతి దారుణ హత్య వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

నేను హెచ్‌ఐవి బాధితుడిని: సరస్వతితో నాకు శారీరక సంబంధం లేదు. తనతో పాటు నివసించే సరస్వతి వైద్య(32)ని హత్య చేసిన నిందితుడు మనోజ్ సానే పోలీసుల విచారణలో చెప్పాడు. సరస్వతి నాకు కూతురిలాంటిదని మనోజ్ పోలీసులకు ఇంతకు ముందు వాంగ్మూలం ఇచ్చి కేసు విచారణ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడని తెలిసింది. దాదాపు 9 ఏళ్లుగా తనతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న మనోజ్ అతని ప్రియురాలు సరస్వతిని మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి కుక్కర్‌లో వండాడు.

 police

మనోజ్, సరస్వతి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలిసింది. అయితే పోలీసుల విచారణలో నిందితుడు మనోజ్ ఆశ్చర్యకరమైన వాంగ్మూలం ఇచ్చాడు. నాకు 2008లో హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలిసిందని, అప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నానని, చాలా కాలం క్రితం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చికిత్స కోసం వెళితే హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని తనకు ఎక్కించడంతో నాకు హెచ్‌ఐవీ వచ్చిందని నిందితుడు మనోజ్ పోలీసులకు చెప్పాడు.

సరస్వతి చాలా రఫ్ గా ఉండేదని, నేను ఇంటికి ఆలస్యంగా వస్తే నేను తనను మోసం చేస్తున్నానని వాదించేదని మనోజ్ పోలీసులకు చెప్పాడు. 10వ తరగతి పరీక్షలు రాసే సమయంలో సరస్వతికి తాను గణితం బోధించేవాడినని మనోజ్ పోలీసులకు చెప్పాడు. మొత్తం మీద తాను హెచ్ఐవీ బాధితుడు అని బాంబు పేల్చిన మనోజ్ రోజుకు ఒక కథ చెబుతున్నాడని కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+