ట్యూషన్ టీచర్ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ?. రూ 30 లక్షల బేరం, కోటీశ్వరుడి కొడుకు !
కాన్పూర్: 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు, అబ్బాయి భవిష్యత్తు కోసం ప్లాన్ చేసిన అతని కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని ట్యూషన్ కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్ కు వెలుతున్న ఆ 17 ఏళ్ల బాలుడిని అదే ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాన్పూర్ లో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అబ్బాయి ప్రతిరోజు ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న రచితా అనే టీచర్ దగ్గరికి ట్యూషన్ కి వెళ్లేవాడు. సాయంత్రం ట్యూషన్ చెబుతున్న టీచర్ రచితాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీరిద్దరి ప్రేమ అక్రమ సంబంధం ఉంది. సాయంత్ర పూట భర్త బయట ఉండటంతో ప్రియుడు ప్రభాత్ ను ఇంటికి పిలిపించుకుంటున్న రచితా అతనితో ఎంజాయ్ చేస్తోంది. ట్యూషన్ పిల్లలు ఉన్న సమయంలో కూడా రచితా ఇంటికి ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రభాత్ వెళ్లివచ్చేవాడని తెలిసింది.

సోమవారం 10వ తరగతి ఆ అబ్బాయి ట్యూషన్ కు వెళ్లాడు. ప్రతిరోజు ఆ అబ్బాయి ట్యూషన్ ముగించుకుని ఇంటికి వచ్చేవాడు. అయితే ట్యూషన్‌కు వెళ్లిన ఆ బాలుడు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆ అబ్బాయి కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్ని చోట్ల వెతికినా అబ్బాయి కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ట్యూషన్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెలుతున్న ఆ బాలుడిని ఫాలో అవుతున్న వ్యక్తికి సంబంధించిన సమాచారం పోలీసుల విచారణలో బయటపడింది. పలు ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సమాచారం సేకరించారు. ట్యూషన్ టీచర్ రచితా ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీని పోలీసులు పరిశీలించారు.
కనపడకుండా పోయిన బాలుడి వెంట ఓ యువకుడు స్టోర్ రూంలోకి ఆ బాలుడిని తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీల్లో బయటపడ్డాయి.స్టోర్ రూంలోకి వెళ్లిన బాలుడు బయటకురాలేదని పోలీసులు గుర్తించారు. తరువాత బాలుడి వెంట వెళ్లిన వ్యక్తి కొంత సేపటి వరకు స్టోర్ రూమ్ లోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. తరువాత స్టోర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన అతను షర్ట్ మార్చుకుని అక్కడి నుంచి స్కూర్ లో వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు.

పోలీసులు స్టోర్ రూమ్ లో పరిశీలించగా కనపడకుండాపోయిన 10వ తరగతి అబ్బాయి అదే స్టోర్ రూమ్ లో శవమై కనిపించారు. స్కూల్ విద్యార్థి హత్యకు గురైనాడని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ వ్యక్తి సమాచారాన్ని సేకరించారు. ట్యూషన్ టీచర్ ప్రియుడు ప్రభాత్ శుక్లా ఆ యువకుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వెంటనే ప్రభాత్ వివరాలు సేకరించిన పోలీసులు అతన్ని, ట్యూషన్ టీచర్ రచితాను అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు గురైన 17 ఏళ్ల బాలుడి తండ్రి కాన్పూర్ లో పెద్ద వ్యాపారవేత్త అని వెలుగు చూసింది. హత్యకు ముందు బాలుడిని వదిలిపెట్టాలంటే రూ 30 లక్షల రూపాయలు ఇవ్వాలని అతని తండ్రిని ప్రభాత్ డిమాండ్ చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు.
లేదంటే రచితా, ప్రభాత్ ల అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆ బాలుడు ట్యూషన్ టీచర్ భర్తకు చెబుతాడనే భయంతో హత్య చేశారా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద ట్యూషన్ టీచర్ అక్రమ సంబంధం కారణంగా 10వ తరగతి అబ్బాయి హత్యకు గురికావడం కాన్పూర్ లో కలకలం రేపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications