Girlfriend: ఆసుపత్రిలో చేర్పించి బాయ్ ఫ్రెండ్ జంప్, ఎయిర్ హోస్టెస్ కావాలని ?

బెంగళూరు: బెంగళూరులో కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలని కలలుకంటోంది. ఎయిర్ హోస్టెస్ కావాలని ఆమె బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో చేరి శిక్షణ తీసుకుంటున్నది. సాయంత్రం తల్లికి ఫోన్ చేసిన యువతి తాను ఇంటికి వస్తున్నానని చెప్పింది. మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి మీ అమ్మాయి ఆసుపత్రిలో ఉందని చెప్పారు. తలకు తీవ్రగాయాలైన యువతి చికిత్స విఫలమై చనిపోయింది. అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి ఆమెను సొంత ఊరికి పిలుచుకుని వెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడని మొదటు అందరూ అనుకున్నారు. అయితే యువతిని ఆసుపత్రిలో చేర్పించింది ఆమె బాయ్ ఫ్రెండ్ అని, తరువాత అతను గోవాకు పారిపోయాడని వెలుగు చూసింది. బెంగళూరులోని కాల్ సెంటర్ లో ఉద్యోగానికి రాజీనామా చేసిన యువతి తరువాత బాయ్ ఫ్రెండ్ కోసం గోవా వెళ్లిందని, అక్కడ చాలా స్టోరీ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఎయిర్ హోస్టెస్ కావాలని ఆశ

ఎయిర్ హోస్టెస్ కావాలని ఆశ

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగల పట్టణంలో నివాసం ఉంటున్న తబసమ్ ఇర్షాద్ అహమ్మద్ అలియాస్ తబసమ్ (19) అనే యువతి ఎయిర్ హోస్టెస్ కావాలని కలలుకంటోంది. ఎయిర్ హోస్టెస్ కావాలని బెంగళూరు చేరుకున్న తబసమ్ ఓ ప్రైవేట్ సంస్థలో చేరి శిక్షణ తీసుకుంటున్నది.

ఆసుపత్రిలో చనిపోయిన తబసమ్

ఆసుపత్రిలో చనిపోయిన తబసమ్

బెంగళూరు నుంచి తల్లికి ఫోన్ చేసిన తబసమ్ తాను ఇంటికి వస్తున్నానని చెప్పింది. మరుసటి రోజు బెళగావి జిల్లా ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి మీ అమ్మాయి తబసమ్ ఆసుపత్రిలో ఉందని చెప్పారు. తలకు తీవ్రగాయాలైన తబసమ్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై తబసమ్ చనిపోయింది.

 గోవాలో బాయ్ ఫ్రెండ్ అరెస్టు

గోవాలో బాయ్ ఫ్రెండ్ అరెస్టు

గుర్తు తెలియని వ్యక్తి తబసమ్ ను బెళగావికి పిలుచుకుని వెళ్లి జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడని మొదటు అందరూ అనుకున్నారు. అయితే తబసమ్ ను బెళగావిలోని ఆసుపత్రిలో చేర్పించింది ఆమె బాయ్ ఫ్రెండ్ అని, తరువాత అతను గోవాకు పారిపోయాడని వెలుగు చూసింది. గోవా వెళ్లిన బెళగావి పోలీసులు తబసమ్ బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేసి బెళగావి తీసుకొచ్చారు.

 కాల్ సెంటర్ లో ఉద్యోగం మానేసింది

కాల్ సెంటర్ లో ఉద్యోగం మానేసింది

తబసమ్ బెంగళూరులోని కాల్ సెంటర్ లో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తున్న తబసమ్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సంపాధించాలని శిక్షణ తీసుకుంటున్నది. ఈనెల 6వ తేదీన ఉద్యోగానికి రాజీనా చేసిన తబసమ్ నేను ఊరికి వెలుతున్నానని ఆమె స్నేహితులు, కాల్ సెంటర్ లోని సీనియర్ అధికారులకు చెప్పింది.

 బాయ్ ఫ్రెండ్ కోసం గోవా వెళ్లింది

బాయ్ ఫ్రెండ్ కోసం గోవా వెళ్లింది


ఈనెల 7వ తేదీన తబసమ్ గోవా వెళ్లి ఆమె స్నేహితుడిని కలిసింది. అనారోగ్యానికి గురైన తబసమ్ గోవాలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. తబసమ్ గోవాలోనే ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. అయితే గోవాలోని పణజి బస్ స్టాప్ లో తబసమ్ తలకు తీవ్రగాయాలై కనిపించింది. ఈనెల 11వ తేదీన తబసమ్, ఆమె బాయ్ ఫ్రెండ్ బెంగళూరు వచ్చారు.

 ఆసుపత్రిలో వదిలేసి ఎస్కేప్

ఆసుపత్రిలో వదిలేసి ఎస్కేప్

బెంగళూరు చేరుకున్న తరువాత మరుసటి రోజు తబసమ్, ఆమె బాయ్ ఫ్రెండ్ బెళగావి వెళ్లారు. బెళగావి జిల్లా ఆసుపత్రిలో తబసమ్ ను చేర్పించి ఆమె మొబైల్ ఫోన్ ఎత్తుకున్న బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోతూ తబసమ్ తల్లి మొబైల్ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేశాడు.

 గోవాలో ఏం జరిగింది ?

గోవాలో ఏం జరిగింది ?

మీ అమ్మాయి బస్ స్టాండ్ లో బస్సు దిగే సమయంలో కిందపడటంతో తలకు తీవ్రగాయాలైనాయని, నేనే ఆసుపత్రిలో చేర్పించానని, దయచేసి ఈ వ్యవహారంలో తనను లాగకూడదని మెసేజ్ చేసి గోవా వెళ్లిపోయాడు. తబసమ్ మీద అత్యాచారం చేసి ఆమె తల మీద దాడి చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు బెళగావి కేసు పెట్టారు. తబసమ్ గోవా ఫ్రెండ్ ను అరెస్టు చేసిన బెళగావి పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+