ప్రియుడ్ని ఇంటికి తీసుకొచ్చింది, పేరెంట్స్ వస్తున్నారని..
గాంధీనగర్: ఎవరూ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి రప్పించుకున్న ఓ కాలేజ్ యువతి.. తన తల్లిదండ్రులు అనుకున్న సమయం కంటే ముందే రావడంతో.. అతనిని వార్డ్ రోబ్‌లో దాచిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. అరగంట, గంట అయినా తనను బయటకు తీయక పోవడంతో అతను బయటకు వచ్చాడు.
తనను వార్డ్ రోబ్‌లో దాచిన తన గర్ల్ ఫ్రెండ్‌కు.. తనకు ఊపిరి ఆడటం లేదంటూ ఓ ఫోన్ సందేశం కూడా పంపించాడు. ఫలితం లేకపోవడంతో వెంటనే వార్డ్ రోబ్‌లోంచి బయటకు వచ్చేశాడు. అతనిని చూసిన ఆ యువతి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తేరుకుని అతగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

గుజరాత్‌కు చెందిన స్మిత, రాహుల్ ప్రేమికులు. ఓ రోజు స్మిత తల్లిదండ్రులు ఊరెళ్ళారు. దీంతో ఆమె తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. తల్లిదండ్రులు ఓ రోజు ముందుగానే రావడంతో రాహుల్ దొరికిపోయాడు. తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ స్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌ను ఇదే విషయమై పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications