Boyfriend: భర్తకు విషం పెట్టిన కొత్త పెళ్లి కూతురు, హత్యకు ఫోన్ లో భార్య, ప్రియుడు చాటింగ్ !

చెన్నై/కన్యాకుమారి: యువతి, యువకుడికి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. రెండు నెలల క్రితం ఇద్దరికి బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. భర్త ఇంటికి వెళ్లిన భార్య అతనితో కాపురం చేస్తోంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన భర్త భోజనం చేసి కొంతసేపటి తరువాత కుప్పకూలిపోయాడు. భర్తను వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు నవ వరుడి మీద విషప్రయోగం జరిగిందని చెప్పడంతో అందరూ హడలిపోయారు. కొత్త పెళ్లి కూతురు మాత్రం ప్లాన్ మిస్ అయ్యిందని రగిలిపోయింది.

 రెండు నెలల క్రితం పెళ్లి

రెండు నెలల క్రితం పెళ్లి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ఇరానియల్ సమీపంలోని అల్వార్ ప్రాంతంలో వడివేల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇరకులానికి చెందిన సుజాత అలియాస్ సుజికి వివాహం చెయ్యాలని వాళ్ల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ఆగస్టు 31వ తేదీన వడివేల్, సుజికి బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది.

 కుప్పకూలిపోయిన భర్త

కుప్పకూలిపోయిన భర్త

రెండు నెలల నుంచి వడివేల్, సుజి దంపతులు చాలా సంతోషంగా తిరుగుతున్నారు. వడివేలు ఇంటిలోనే ఉంటున్నర అతని భార్య సుజి అతనితో కాపురం చేస్తోంది. వడివేలు భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి వెళ్లిన వడివేలు భోజనం చేశాడు. రాత్రి వడివేలు ఇంట్లో వాత కుప్పకూలిపోయాడు.

 కొత్త పెళ్లికూతురి మీద విషప్రయోగం

కొత్త పెళ్లికూతురి మీద విషప్రయోగం

వడివేలును వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు నవ వరుడు వడివేలు మీద విషప్రయోగం జరిగిందని చెప్పడంతో అందరూ హడలిపోయారు. వారం రోజుల తరువాత వడివేలు పూర్తిగా కోలుకోలేదు. వడివేలుకు అతని భార్య సుజి మీద అనుమానం రావడంతో ఆమె మీద నిఘా వేశాడు.

 బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్..... వాట్సాప్ లో హత్య కోసం చాటింగ్

బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్..... వాట్సాప్ లో హత్య కోసం చాటింగ్

భార్య సుజి, ఆమె మాజీ ప్రియుడు మురుగన్ టచ్ లో ఉన్నారని భార్య మొబైల్ ఫోన్ వాట్సాప్ చాటింగ్ చూసిన తరువాత భర్త వడివేలుకు తెలిసింది. వడివేలు అతని భార్య సుజి మొబైల్ ఫోన్ లో ప్రియుడు మురుగన్ తో కలిసి ఆమె భర్త వడివేలును హత్య చెయ్యాలని చాటింగ్ చేసిన విషయం తెలుసుకున్న వడివేలు హడలిపోయాడు.

 భర్తకు మాత్రలు మార్చేసి ఇచ్చిన భార్య

భర్తకు మాత్రలు మార్చేసి ఇచ్చిన భార్య

తాను రోజు వేసుకుంటున్న మాత్రలు మార్చేసిన సుజి తనకు పాయిజన్ మాత్రలు ఇచ్చిందని వడివేలుకు తెలిసిపోయింది. భార్య సుజి వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ తో సహ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వడివేలు ఆమె మీద కేసు పెట్టాడు. తన భర్త వడివేలు తనను టార్చర్ పెడుతున్నాడని, అందుకే నిద్రమాత్రలు ఇచ్చానని, అతన్ని చంపాలని అనుకోలేదని సుజి అంటోందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+