Girlfriend: సిటీలో ఉద్యోగం, ప్రియురాలిని ఒక్కసారి చూడాలని సినిమా స్కెచ్, బుర్కా వేసుకున్నా నడకలో!

లక్నో/ ఉత్తరప్రదేశ్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం పాటు ప్రేమికులు సంతోషంగా తిరిగారు. ప్రేమికులు వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. చదువు పూర్తి చేసిన యువకుడికి చాలాదూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది. అయితే కొంతకాలం నుంచి ప్రియురాలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రియుడు ఆమెను కలవలేకపోయాడు. ఉద్యోగంలో చేరితో మూడు నాలుగు నెలల తరువాతే వస్తానని, అంతలోపు ప్రియురాలిని ఒక్కసారి చూస్తే బాగుంటుందని ప్రియుడు అనుకున్నాడు. ప్రియురాలిని కలవడానికి అతను అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

చివరికి బుర్కా వేసుకున్న ప్రియుడు ప్రియురాలు నివాసం ఉంటున్న వీధిలోకి వెళ్లాడు. బుర్కా ఎవరు వేసుకున్న వాళ్ల ముఖాలు, శరీరం కనపడదు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే మగాళ్ల నడక, ఆడవాళ్ల నడకలో చాలా తేడా ఉంటుంది. ప్రియుడి నడక చూసిన స్థానికులు అతన్ని పట్టుకోవడంతో కథ అడ్డం తిరిగింది.

లవర్స్ ఎంజాయ్

లవర్స్ ఎంజాయ్

ఉత్తరప్రదేశ్ లోని శహజహాన్ పుర్ లో సైఫ్ ఆలీ అలియాస్ ఆలీ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శహజహాన్ పుర్ కు 30 కిలోమీటర్ల దూరంలోని మోహమ్మద్ పూర్ లో నివాసం ఉంటున్న 23 ఏళ్ల యువతి, ఆలీ ప్రేమించుకున్నారు. కొంతకాలం పాటు ఆలీ అతని ప్రియురాలు సంతోషంగా తిరిగారు. ప్రేమికులు వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు.

ఉద్యోగం వచ్చిందని ఆనందం

ఉద్యోగం వచ్చిందని ఆనందం

కొంతకాలం నుంచి ప్రియురాలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఆమెను ఆలీ కలవలేకపోయాడు. చదువు పూర్తి చేసిన ఆలీకి లక్నోలో ఉద్యోగం వచ్చింది. చాలాదూర ప్రాంతంలో ఉద్యోగం రావడంతో ఆలీ వెళ్లడానికి సిద్దం అయ్యాడు. ఉద్యోగంలో చేరితో మూడు నాలుగు నెలల తరువాతే వస్తానని, అంతలోపు ప్రియురాలిని ఒక్కసారి చూస్తే బాగుంటుందని ఆలీ అనుకున్నాడు.

బుర్కా వేసుకుని పోలో అంటూ వెళ్లిపోయాడు

బుర్కా వేసుకుని పోలో అంటూ వెళ్లిపోయాడు

ప్రియురాలిని కలవడానికి ఆలీ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. ఆలీ, అతను ప్రేమించిన యువతి ఒకే మతం (ముస్లీంలు) కావడంతో ప్రియుడు ఆలీ సినిమా స్కెచ్ వేశాడు. బుర్కా వేసుకున్న ఆలీ ప్రియురాలు నివాసం ఉంటున్న మోహమ్మద్ పూర్ లోని ఆమె నివాసం ఉండే వీధిలోకి వెళ్లాడు. ప్రియురాలు కనపడకపోవడంతో ఆలీ వీధిలో అటూఇటూ తిరిగాడు.

ఆలీ నడక చూసి పట్టుకున్న స్థానికులు

ఆలీ నడక చూసి పట్టుకున్న స్థానికులు

బుర్కా ఎవరు వేసుకున్న వాళ్ల ముఖాలు, శరీరం కనపడదు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే మగాళ్ల నడక, ఆడవాళ్ల నడకలో చాలా తేడా ఉంటుంది. బుర్కా వేసుకుని తిరుగుతున్న ఆలీ నడక మగాడి నడకలా ఉండటంతో స్థానికులు అతన్ని అడ్డగించి బుర్కా తియ్యాలని చెప్పారు. మొదట బుర్కా తియ్యడానికి నిరాకరించిన ఆలీ చివరికి స్థానికులు చితకబాదుతారని భయపడి బుర్కా తీసేయడంతో అందరూ షాక్ అయ్యారు. స్థానికులు ఆలీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆలీ లవ్ స్టోరీ విని నవ్వుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+