Boyfriends: విదేశాల్లో భర్త, భార్యకు ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్, రాత్రి భార్య ఏం చేసిందంటే ?

చెన్నై/కన్యాకుమారి: భర్త విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రతినెల వేలల్లో భార్యకు డబ్బులు పంపిస్తున్నాడు. రెండు సంవత్సరాల తరువాత భర్త విదేశాల నుంచి సొంత ఊరికి వెళ్లాడు. విదేశాల నుంచి వచ్చిన భర్తకు అతని భార్య గురించి షాకింగ్ సమాచారం తెలిసింది. తన భార్యకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న భర్త బిత్తరపోయాడు. తన భార్యను కంట్రోల్ పెట్టాలంటే విదేశాలకు వెళ్లకూడదని భర్త డిసైడ్ అయ్యాడు. భర్త విదేశాలకు వెళ్లకపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లి బాయ్ ఫ్రెండ్స్ ను కలవలేక భార్య రగిలిపోయింది. అంతే భర్తను చంపడానికి భార్య వేసిన ప్లాన్ లు తెలుసుకున్న బంధువులు, పోలీసులు షాక్ అయ్యారు.

 భార్యతో సంతోషంగా ఉన్నాడు

భార్యతో సంతోషంగా ఉన్నాడు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నిత్రవిలై ప్రాంతంలో జైశంకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సుజాత అలియాస్ సుజి అనే యువతిని జైశంకర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత జైశంకర్ అతని భార్య సుజితో సంతోషంగా కాపురం చేశాడు.

 విదేశాలకు వెళ్లిన భర్త

విదేశాలకు వెళ్లిన భర్త

రెండు సంవత్సరాల క్రితం జైశంకర్ ఉద్యోగం చెయ్యడానికి విదేశాలకు బయలుదేరాడు. నేను రెండు సంవత్సరాలు రాలేనని, నువ్వు జాగ్రత్గగా ఉండాలని, ప్రతినెల డబ్బులు పంపిస్తానని జైశంకర్ అతని భార్య సుజికి చెప్పారు. మీరు సంతోషంగా వెళ్లి రావాలని, నేనే క్షేమంగానే ఉంటానని సుజీ ఆమె భర్త జైశంకర్ కు చెప్పింది.

 బిత్తరపోయిన భర్త... భార్యకు ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్

బిత్తరపోయిన భర్త... భార్యకు ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్

రెండు సంవత్సరాల తరువాత జైశంకర్ విదేశాల నుంచి కన్యాకుమారి జిల్లాలోని అతని సొంత ఊరికి వెళ్లాడు. విదేశాల నుంచి వచ్చిన జైశంకర్ కు అతని భార్య సుజి గురించి అతని స్నేహితులు షాకింగ్ సమాచారం తెలిసింది. నీ భార్య సుజికి ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, నువ్వు విదేశాల్లో ఉంటే నీ భార్య బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ జల్సా చేస్తోందని జైశంకర్ కు అతని ఫ్రెండ్స్ చెప్పారు.

 భర్త అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన భార్య

భర్త అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన భార్య

భార్య సుజి గురించి షాకింగ్ సమాచారం తెలుసుకున్న జైశంకర్ బిత్తరపోయాడు. తన భార్య సుజిని కంట్రోల్ పెట్టాలంటే విదేశాలకు వెళ్లకూడదని, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని జైశంకర్ డిసైడ్ అయ్యాడు. భర్త జైశంకర్ విదేశాలకు వెళ్లకపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లి బాయ్ ఫ్రెండ్స్ ను కలవలేక సుజి రగిలిపోయింది.

 భర్తతో గొడవలు

భర్తతో గొడవలు

భర్త జైశంకర్ ను ఎలాగైనా విదేశాలకు పంపించి తన ప్రియులతో ఎంజాయ్ చెయ్యాలని సుజి స్కెచ్ వేసింది. ఏదో ఒక విషయంలో భర్త జైశంకర్ తో గొడవపెట్టుకుంటున్న సుజి రోజు రాద్దాంతం చేసింది. జైశంకర్, సుజి దంపతులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. దంపతులకు నచ్చ చెప్పిన పోలీసులు ఇంటికి పంపించారు.

 మర్యాదగా విదేశాలకు వెళ్లిపో......లేదంటే చంపేస్తాను

మర్యాదగా విదేశాలకు వెళ్లిపో......లేదంటే చంపేస్తాను

రాత్రి భోజనం చేసిన జైశంకర్ ఇంటిలో నిద్రపోయాడు. అర్దరాత్రి సుజి నిద్రలేచి గ్యాస్ మీద నీళ్లు చాలా వేడిగా కాంచింది. నిద్రపోతున్న బర్త మీద వేడి నీళ్లు పోసిన సుజి మర్యాదగా విదేశాలకు వెళ్లాలనని, లేదంటే వేడి నూనె నీ మీద పోసి చంపేస్తానని బెదిరించింది. వేడినీళ్లు మీద పడటంతో తీవ్రగాయాలైన జైశంకర్ ఆసుపత్రిలో చేరి అతని భార్య సుజి మీద పోలీసు కేసు పెట్టాడు. విషయం తెలుసుకున్న కిలాడీ లేడీ సుజి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పరారైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+