ప్రపంచంలోనే అత్యంత వేగం: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ నుంచి గురువారం ఉదయం బ్రహ్మోస్‌ను విజయవంతంగా ప్రయోగించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), బ్రహ్మోస్ శాస్త్రవేత్తలు, భారత సైన్యం ఆధ్వర్యంలో క్షిపణిని పరిశీలించారు.
ఈ ప్రయోగంలో క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని చాలా కచ్చితత్వంతో చేరుకుందని అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్‌ను గత ఏడాది నవంబరులో సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

కాగా, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయీజ్ క్షిపణి ఇది. దీని బరువు దాదాపు 2.5టన్నులు, పొడవు 8.4మీటర్లు. ఇది సుమారు 200 నుంచి 300 కేజీల బరువైన వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. దీనిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్‌ను డీఆర్డీఓ, రష్యాకు చెందిన రాకెట్ డిజైన్ బ్యూరో సంస్థ సంయుక్తంగా తయారు చేశాయి.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications