దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)
ఢిల్లీ : రకరకాల డ్యాన్సులు చూసి ఉంటాము. క్లాసికల్, వెస్ట్రన్, బెల్లీ, హిప్ హప్.. ఇలా ఎన్నోరకాల నృత్యాలు మనకు కనువిందు చేశాయి. ఇటీవల దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు సంబంధించి కొందరు టిక్ టాక్ లో హావభావాలతో కూడిన వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు డీడీ ఛానల్ వార్తల మ్యూజిక్ కు తగ్గట్టుగా బ్రేక్ డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. కొందరు నెటిజన్లు తెగ పొగుడుతుంటే TYSM (thank you so much) అని సదరు యువకుడు మురిసిపోతూ రిప్లై ఇస్తున్నాడు.
ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు వైశాఖ నాయర్. ఏదైనా డిఫరెంట్ గా చేయాలని తపించిపోయి దూరదర్శన్ వార్తల మ్యూజిక్ పై కన్నేశాడు. ఇటీవల కొందరు ఆ మ్యూజిక్ కు తగ్గట్టుగా హావాభావాలతో రూపొందించిన వీడియోలు ప్రాచుర్యం పొందాయి. ఆ క్రమంలో ఈ యువకుడు భిన్నంగా చేయాలనుకుని బ్రేక్ డ్యాన్స్ ఎంచుకున్నాడు.
Doordarshan would not hv imagined this in their wildest dreams !! 😂 pic.twitter.com/epJ86aVssE
— (•ิ_•ิ) Silk (@Ya5Ne) March 4, 2019

దూరదర్శన్ ఛానల్ ప్రారంభం నుంచి స్టేషన్ ఐడీగా అదే మ్యూజిక్ కొనసాగుతోంది. ఆ మ్యూజిక్ వింటే చాలు ఎక్కడున్నా సరే అది డీడీ వార్తలకు సంబంధించిన మ్యూజిక్ గా గుర్తుపట్టవచ్చు. అంతలా పాపులర్ అయిన ఆ మ్యూజిక్ కు తగ్గట్టుగా బ్రేక్ డ్యాన్స్ చేస్తే ఇంకేమన్నా ఉంటుందా. చాలామంది శభాష్ అంటూ వైశాఖ నాయర్ ను పొగిడేస్తుండటంతో బాగా వైరల్ అయింది. టిక్ టాక్ యాప్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు లక్షా 75వేల మంది వీక్షించారు. ఇక నెటిజన్ల కామెంట్లకు కొదువే లేదు. పిల్ల చేష్టలు పోలేదని కొందరంటే.. వీడు ఏ మోతకైనా డ్యాన్స్ చేయగలడంటూ మరికొందరు కామెంటుతున్నారు.












Click it and Unblock the Notifications