పఠాన్‌కోట్ దాడి: 'సీరియస్ విషయం, అసలేం జరిగింది.. మోడీ చెప్పాలి'
తిరువనంతపురం: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని, ఏం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గురువారం నాడు డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ ఇప్పటికైనా పెదవి విప్పాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ పైన దాడి గురించి మట్లాడాలన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

కాబట్టి ప్రధాని మోడీ ఇప్పటికైనా జరిగింది ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన అనంతరం ఈ దాడి జరిగిందన్నారు. కాబట్టి ఈ దాడి ఎందుకో తెలుసుకోవాలని దేశం అనుకుంటోందన్నారు.
ఇది చాలా సీరియస్ విషయమన్నారు. ప్రధాని మోడీ ఈ విషయంలో ఎంతమాత్రం మౌనం వహించలేరన్నారు. కచ్చితంగా అతను మాట్లాడాల్సిందేనని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన భారత జాతికి చెప్పాలన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications