చీర తెచ్చిన పేచీ.. పెళ్లి కాస్త ఫైటింగ్ కు దారి తీసింది

Subscribe to Oneindia Telugu

బీహార్ : చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు పెటాకులవుతున్న ఉదంతాలు ఈమధ్య తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నాయి. పెట్టిపోతల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గని వధువరుల కటుంబాలు.. ఏ చిన్న పొరపాటు జరిగినా పెళ్లిని రద్దు చేసుకోవడానికి వెనుకాడడం లేదు.

తాజాగా బీహార్ లోని చంపారన్ జిల్లాలో చీర కారణంగా పీటల మీద పెళ్లి రద్దయినంత పని జరిగింది. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుందనగా.. ముందుగా చెప్పిన ప్రకారం వరుడి తరుపు వాళ్లు వధువుకు బెనారస్ చీర పెట్టకపోవడంతో, వధువు మరియు ఆమె కుటుంబ సభ్యులు మగపెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు.

Bride aborts marriage for not getting 'Banarasi' saree

గొడవ తారాస్థాయికి చేరడంతో.. వరుడి తరుపు బంధువులందరినీ ఓ గదిలో పెట్టి తాళం వేసేశారు వధువు తరుపు వాళ్లు. అనంతరం విషయం కాస్త పోలీసుల చెవిన పడడంతో మగపెళ్లి వారిని గది నుంచి విడిపించారు. తర్వాత ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు, వారికి నచ్చజెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. ఇదంతా జరిగిన రెండు రోజులకు ఇరు కుటుంబాల పెద్దలు కలిసి తిరిగి వివాహం జరిపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When bride's family came to know that the groom's family had not got the 'Banarasi' saree which they demanded, they called off the marriage. This led to a heated argument between both the families and the groom's family was taken into hostage by bride's family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి