దీని దుంపతెగ.. ఎంతపని చేసింది పిల్ల..! పెళ్లైన తెల్లారే జంప్..! ఎవరితో తెలిస్తే మైండ్ బ్లాంకే..!!

రాజస్థాన్‌/హైదరాబాద్ : సమాజంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగిపోతున్నాయి. తెల్లారి లెగిస్తే ఎవరు ఎవరితో సెట్ అయిపోతారో అర్థం కాని పరిస్థిుతులు నెలకొన్నాయి. ఇటీవల మానవ సంబంధాల వెనక ఎలాంటి మర్మం దాగి ఉందో కనుక్కోవడం కూడా కష్టంగా మారింది. మారుతున్న పాశ్చాత్య పోకడలు. ఇంటర్ నెట్, సినిమాలు కూడా మానవ సంబంధాలపై పెద్ద యెత్తున ప్రభావం చూపుతోంది.

సరిగ్గా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ లో చోటుచేూసుకుంది. పెళ్లయిన తెల్లవారే ఇంట్లోంచి పారిపోయిన ఓ నవవధువు 23 రోజుల తర్వాత పొరుగు రాష్ట్రంలో మరో యువతితో సహజీవనం చేస్తూ కనిపించడంతో పోలీసులు, బంధువులు షాకయ్యారు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్‌కు చెందిన యువతికి షాజహాన్‌పూర్‌కు చెందిన యువకుడితో మూడు వారాల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లైన మరుసటి రోజే కొత్త పెళ్లికూతురు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.ఆమె కోసం గాలించి, విసిగి వేసారిన బంధువులు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం యూపీ, రాజస్థాన్‌లలో గాలింపు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయింది.

bride aloped nexy day of wedding.!Mind Blank If knows with whom she gone..!!

అయితే, అనూహ్యంగా రెండు రోజుల క్రితం ఆమె జాడ లభ్యమైంది. హరియాణాలోని మనేసర్‌లో ఆమె వున్నట్టు పోలీసులు గుర్తించారు. బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. అక్కడామె నేషనల్ చాంపియన్ అయిన మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది. నాలుగేళ్లుగా తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కొత్త పెళ్లికూతురు పోలీసులకు తెలిపింది.

ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. తామిద్దరం మేజర్లమని, తాము ఎలా ఉండాలో, ఎవరితో ఉండాలో తమకు తెలుసని వాదించారు. నవ వధువు మాట్లాడుతూ తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేశారని, అందుకే పారిపోయి వచ్చానని తెలిపింది. దీంతో చేసేది ఏమీలేక కోర్టు ఆదేశాలతో పోలీసులు ఇద్దరినీ విడిచిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+