మోడ్రన్ బ్రైడ్ అండ్ గ్రుమ్: మండపంపైనే ముద్దులాట.. సిగ్గు, బిడయం లేకుండా..

ఒకప్పుడు పెళ్లిళ్లు వేరు.. ఇప్పుడు వేరు. అంతా కాలం మహిమ... అయితే ఏ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేస్తున్నారు. అయితే మండపం, మసీదు, చర్చి వేదికలుగా జరిగే వివాహల్లో కూడా మార్పు జరుగుతుంది. నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయంలో కూడా నయా ట్రెండ్ వస్తోంది. పెళ్లి మండపం, వేదికలపై ముద్దు పెట్టుకోవడం.. కౌగిలించుకోవడం జరుగుతున్నాయి. అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతోపాటు లవ్‌ మ్యారేజ్‌లు, పెళ్లికి ముందే డేటింగ్‌లు, లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌ వచ్చాయి. అయితే ఎవరి సాంప్రదాయలు, పద్దతులకు అనుగుణంగా పెళ్లిలు జరిపిస్తున్నారు. క్రిస్టియన్‌ పెళ్లిలో ముద్దు పెట్టుకోవడం సాధారణమే కానీ.. హిందూ సాంప్రదాయల్లో ఇలాంటివి ఎక్కడ కనిపించవు. హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

bride and groom kiss each other in mandap

వీడియోలో పెళ్లితంతును ముగించిన తురువాత వధువుని ముద్దు పెట్టుకోవాలని మండపం వద్ద ఉన్న అతిథులు వరుడిని కోరారు. దీంతో పెళ్లి వేదిక వద్ద కుటుంబ సభ్యలు, బంధువులు ఉన్నప్పటికీ సిగ్గుపడకుండా వరుడు, పెళ్లి కూతురు ముఖాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. వధువు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి కిస్‌ చేసింది.

తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టు​కున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్‌ అయపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యే వరకు కూడా ఆగాలేరా.. పద్దతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..అంటూ ఫైర్‌ అవుతున్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వధు వరుడులు ఇద్దరూ రెచ్చిపోయారు. ఒకరికొకరు కలిసి కిస్ చేసుకున్నారు. పక్కన ఉన్న వారు కూడా కాస్త ఆశ్చర్యపోయారు. ఎంత ఫ్యామిలీ పిలిచినా.. ఇలా చేస్తారా అంటూ ఆశ్చర్యపోయారు. కానీ కాలంతోపాటు మనం మారాల్సిందేనని.. ఈ వీడియో రుజువు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+