రెచ్చిపోయి వరుడి స్నేక్ డ్యాన్స్: భయపడి పెళ్లి రద్దు చేసిన వధువు!

తన పెళ్లి సందర్భంగా ఆనందంలో ఓ నవ వరుడు స్నేక్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అయితే, అతడి చిందులు ఏకంగా పెళ్లి ఆగిపోవడానికి కారణమవడం గమనార్హం.

లక్నో: తన పెళ్లి సందర్భంగా ఆనందంలో ఓ నవ వరుడు స్నేక్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అయితే, అతడి చిందులు ఏకంగా పెళ్లి ఆగిపోవడానికి కారణమవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్‌కి చెందిన ప్రియాంకకి ఇదే ప్రాంతానికి చెందిన మిశ్రాకి మంగళవారం నిశ్చయమైంది. ఈ క్రమంలో వరుడి కుటుంబీకులు మండపానికి వస్తుండగా అక్కడే ఉన్న డీజే నాగిని మ్యూజిక్ పెట్టాడు. దీంతో మిశ్రా ఏదో పూనకం వచ్చినట్లు నాగినిలా రెచ్చిపోయి డ్యాన్స్(స్నేక్ డ్యాన్స్) చేశాడు.

Bride calls off wedding after groom's nagin dance

పాములాగా బుసలు కొడుతూ వింతగా ప్రవర్తించాడు. అతడి స్నేహితులు కూడా ఉత్సాహపరుస్తూ డబ్బులు చల్లారు. కాగా, మిశ్రా వింత ప్రవర్తనకు భయపడిన వధువు ప్రియాంక.. ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మిశ్రా మద్యం మత్తులో ఈ విధంగా డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, పెళ్లి సందర్భంగా ఏదో సరదాగా మిశ్రాలో అలా డ్యాన్స్ చేశాడని చెప్పే ప్రయత్నం అతని తల్లిదండ్రులు చేసినప్పటికీ.. వధువు మాత్రం వినిపించుకోలేదు. దీంతో చేసేదేం లేక మండపం నుంచి వెనుదిరిగారు వరుడు, అతని కుటుంబసభ్యులు, బంధువులు. కాగా, ఆ మరుసటి రోజే ప్రియాంక మరో వ్యక్తిని వివాహమాడటం గమనార్హం. దీంతో మిశ్రాతో పెళ్లి ఇష్టం లేకనే ప్రియాంక ఈ విధంగా చేసిందా? అని పెళ్లికి వచ్చినవారు చర్చించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+