ఫుల్లుగా తాగొచ్చి పెళ్లి పీటలెక్కిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..!

భువనేశ్వర్‌ : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. వేదమంత్రాల సాక్షిగా ఇద్దరు ఒకటయ్యే వివాహ బంధం అనుబంధాలను పెంచుతుంది. కానీ, కొందరు పెళ్లి వేడుకను అభాసుపాలు చేస్తున్నారు. ఒడిశాలో జరిగిన ఓ సంఘటన వివాహ బంధానికి మాయని మచ్చలా మారింది.

సంబల్‌పూర్ జిల్లాలోని గోవర్ధ బడ్మాల్ గ్రామంలో పెళ్లి పీటల పైనుంచి వధువు వెళ్లిపోయడం చర్చానీయాంశమైంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఆమె పెళ్లొద్దంటూ మొండికేసింది. వరుడు ఫూటుగా తాగొచ్చి పెళ్లి పీటలెక్కడమే అందుకు కారణం. పెళ్లిమండంపలోకి తూగుతూ తూలుతూ వచ్చిన సదరు పెళ్లికొడుకు కనీసం తాళి కట్టలేని పరిస్థితి. వరుడిని ఆ స్థితిలో చూసి మద్యానికి బానిసయ్యాడని గుర్తించింది. అతడితో వివాహం జరిగితే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని భావించి పెళ్లికి నిరాకరించింది.

 Bride rejects drunk groom, walks out of wedding

అబ్బాయి తరపు బంధువులు పెళ్లి కూతురును బతిమిలాడినా లాభం లేకుండా పోయింది. పెళ్లి రోజు కూడా తాగకుండా ఉండలేనోడు.. జీవితంలో తనను ఎలా చూసుకుంటాడని ప్రశ్నించింది. చివరకు చేసేదేమీ లేక పెద్ద మనుషులు పెళ్లిని రద్దు చేశారు. దాంతో పెళ్లికొడుకు ఫ్యామిలీ మెంబర్స్ కాట్నకానుకలు తిరిగి ఇచ్చేసి లెక్కలు సెటిల్ చేసుకున్నారు. అయితే అలాంటి తాగుబోతుతో పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేదని.. పెళ్లికి నిరాకరించడం మంచిదైందని వధువును అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+