మీలో మేధావి లక్షణాలున్నాయా..! : తెలుసుకోవాలంటే.. ఓ లుక్కేయండి

బ్రిటన్ : సమాజంలో మేధావి వర్గానికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఎక్కడికెళ్లినా వాళ్లో 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్'. మీడియా చర్చలకైనా, ప్రజా సమస్యల సాధనకైనా మరే ఇతర రంగాల్లోనైనా మేధావులకే పెద్ద పీట. అందుకే ప్రస్తుత సమాజంలో 'జీనియస్' అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవడానికి ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరతుంటారు.

అయితే స్వయంప్రకటిత మేధావి తనం తెచ్చి పెట్టుకుంటే వస్తుంది గానీ అసలు సిసలు జీనియస్ అనిపించుకోవాలంటే మాత్రం దానికీ ఓ లెక్కుంది అంటోంది ఓ సర్వే, ఆ లెక్కని బట్టే సదరు వ్యక్తులు మేథావి వర్గానికి చెందినవారా..! కాదా..! అన్నది నిర్ధారించుకోవచ్చట.

ఇంతకీ ఆ లెక్కేంటో తెలుసుకోవాలంటే.. బ్రిటన్ కి చెందిన ఓ పరిశోధనా సంస్థ నివేదికపై లుక్కేయాల్సిందే.

తనలో తానే పరధ్యానంగా మాట్లాడుకోవడం..

మేధావి వర్గానికి చెందిన చాలామంది వ్యక్తుల్లో ఈ రకమైన లక్షణం ఉంటుందని చెబుతోంది సర్వే. చాలా విషయాలను మేధావులు తమలో తామే విశ్లేషించుకునే క్రమంలో పక్కనవాళ్లను సైతం పట్టించుకోకుండా తమలో తామే మాట్లాడేసుకుంటుంటారు. ఇదీ మేదావి లక్షణంలో భాగమేనట.

Britan researchers survey on 'GENIUS QUALITIES'

నిత్యం పుస్తకాలతో సహవాసం

అవును.. ఎవరైతే నిత్యం పుస్తక అధ్యయనంలో మునిగి తేలుతారో.. ప్రపంచంపై వారికో స్పష్టమైన అవగాహన ఉంటుందనేది సర్వేలో వెల్లడైన అంశం. దీన్ని బట్టి పుస్తకాల పురుగులంతా మేధావి కోవలోకి వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతోంది సర్వే.

క్షమాగుణం.. కలిసిపోయే తత్వం

మేధావి వర్గానికి చెందినవారికి క్షమాగుణం ఎక్కువని చెబుతోంది సర్వే. తప్పు చేసి, చేసిన తప్పు తెలుసుకున్నవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కూడా మేథావి లక్షణమే అంటోంది.

కష్టాలను స్వీకరిస్తారు

మేధావులు ఎప్పుడూ కష్టాల నుంచి తప్పించుకో చూడరని, వాటిని సవాల్ గా స్వీకరించి సంయమనంతో సమస్యలను చక్కదిద్దుకుంటారనేది సర్వేలో పేర్కొన్న అంశం.

ప్రతీది గమనిస్తారు

ప్రతీ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయడం, భిన్నాభిప్రాయాలను లెక్కలోకి తీసుకుని బేరీజు వేసుకోవడం మేధావుల లక్షణాల్లో అతి ముఖ్యమైందిగా సర్వేలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+