19వ అంతస్తు: బ్రిటానికా కంపెనీ సీసీవో ఆత్మహత్య
గుర్గావ్: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ బ్రిటానికా చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీవోవో) వినీత్ వింగ్ (49) తన సొసైటి అపార్ట్ మెంట్ లోని 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ సైక్లో పేడియా బ్రిటానికా కంపెనీకి దక్షిణ ఆసియా డివిజన్ సీవోవోగా వినీత్ వింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
గుర్గావ్ లోని సైబర్ సిటీలోని తన అపార్ట్ మెంట్ లోని 19వ అంతస్తు మీద నుంచి దూకి వినీత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని జోబులో ఉన్న సూసైడ్ నోట్ ను తాము స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

తనకు జీవితంపై విరక్తి చెందిందని, ఇక తన జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో వినీత్ వింగ్ రాశాడని పోలీసు అధిరులు అన్నారు. వినీత్ డీ -బ్లాక్ లో నివాసం ఉంటున్నాడు. అయితే అతను సీ- బ్లాక్ లోని 19వ అంతస్తు చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు.
19వ అంతస్తులో వినీత్ చెప్పులు ఉండటంతో అతను అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలించిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు అన్నారు. వినీత్ మార్నింగ్ వాక్ వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. వినీత్ కు తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications