బయట నుంచి చూస్తే 'స్పా'.. లోపలికెళ్తే వ్యభిచార లీల.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు!

మహారాష్ట్ర నాసిక్ లోని హెచ్ పిటీ కాలేజీ రోడ్డులో ఉన్న ఒక స్పాలో ఈ బాగోతం బయటపడింది. గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ స్పాపై బుధవారం రాత్రి పోలీసులు దాడి జరిపారు.

నాసిక్: పేరుకేమో అదొక స్పా!.. ఇది జస్ట్ పైకి కవరింగ్ మాత్రమే.. లోపలికి తొంగి చూస్తే కానీ నోరెళ్లబెట్టే విషయం తెలియదు. స్పా ముసుగులో అక్కడ వ్యభిచార లీలలు కొనసాగించడం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా.. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ దందాను పోలీసులు బట్టబయలు చేశారు.

మహారాష్ట్ర నాసిక్ లోని హెచ్ పిటీ కాలేజీ రోడ్డులో ఉన్న ఒక స్పాలో ఈ బాగోతం బయటపడింది. గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ స్పాపై బుధవారం రాత్రి పోలీసులు దాడి జరిపారు. దాడి సమయంలో 8మంది యువతులు అసభ్యకర రీతలో పట్టుబడ్డారు. యువతులతో పాటు ఐదుగురు పురుషులు కూడా పట్టుబడ్డారు.

Brothel Runs In The Name Of Spa Raided; 13 Arrested

పట్టుబడ్డ వ్యక్తులందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ స్పా యజమాని పరేష్ సురానా కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే గతంలోను ఈ స్పా పై పోలీసులు దాడి చేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ సదరు యజమాని తీరులో మాత్రం మార్పు రాలేదని, ఈసారి కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారి మహేశ్ దేవికర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+