వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోడబుట్టిన సోదరిపై రేప్: హత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

థానే: రక్తం పంచుకుపుట్టిన సోదరిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగిన సోదరిని కత్తితో పోడిచి దారుణంగా హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో ఉన్న ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని థానే జిల్లా డాంబిలి ప్రాంతంలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ సోదరి ఉంది. కుటుంబ సభ్యులు ఇంటిలో లేని సమయంలో అతను సోదరి మీద రెండు సార్లు అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.

 Brother arrested for raping sister near Thane in Maharashtra

మంగళవారం ఇంటిలో ఒంటరిగా ఉన్న సోదరి మీద మళ్లీ అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో ఆమె ఎదురు తిరగడంతో కత్తి తీసుకుని పొడిచేశాడు. పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు అతనిని పట్టుకున్నారు.

బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్స్ పెక్టర్ శివార్కర్ తెలిపారు. కామాంధుడిని ఉరి తియ్యాలని అతని సొంత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
A 21-year-old man from near Thane has been arrested by the police for allegedly raping his younger sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X