రేప్ యత్నం విఫలమై మరదలిపై బావ యాసిడ్ దాడి

ముజఫర్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యాసిడ్ దాడికి సంబంధించిన మరో దారుణం జరిగింది. ఇటీవల లైంగిక దాడితో ముడిపడిన రెండో దాడి ఇది. బావ మరదలిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో కసితో ఆమెపై యాసిడ్ దాడి చేశాడు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా చాపర్ ప్రాంతంలోని ఖుద్దా గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారంనాడు తెలిపారు. మహిళ కాలిన గాయాలతో బాధపడుతోంది. ఆమెను జిల్లా అస్పత్రిలో చేర్చినట్లు డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ అరుణ్ కుమార్ చెప్పారు.

 Brother-in-law throws acid on woman after failed rape attempt

తన బావ జహంగీర్ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఆ ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. అందులో విఫలం కావడంతో తనపై యాసిడ్ చల్లి, అక్కడి నుంచి పారిపోయాడని బాధితురాలు చెప్పింది.

పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తిపై పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+