అసభ్యకర దుస్తులు, బాయ్స్‌తో పార్టీ:చెల్లెల్ని చంపాడు

ముంబై: కురచ, అసభ్యకర దుస్తులను ధరించిందని 17 ఏళ్ల సొంత చెల్లెలనే ఓ అన్న హతమార్చిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన సోమవారం నాడు రాత్రి జరిగింది.

మహారాష్ట్రంలోని కొల్హాపూర్‌లో చెల్లెల్ని చంపేశాడు. తన సోదరి అసభ్యకర దుస్తులు ధరిస్తుందని, తరుచూ బాయ్ ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకుంటోదని నిందితుడైన సోదరుడు పోలీసులకు చెప్పాడు.

Brother kills 17 year old sister for wearing indecent clothes

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్హాపూర్‌కు చెందిన పదిహేడేళ్ల యువతి కుటుంబ సంప్రదాయానికి విరుద్ధంగా దుస్తులు ధరిస్తూ, తరచూ అబ్బాయిలతో పార్టీలకు వెళ్లడం ఆమె సోదరుడు చూశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతను తలపై కర్టెన్‌ రాడ్డుతో కొట్టి సోదరిని హత్య చేశాడు.

తీవ్ర రక్తస్రావంతో యువతి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు కొంతకాలంగా ఆత్మన్యూనతతో బాధపడుతుండడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్య కాదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+