ఆడుకోవడానికి వెళ్లి అన్నాచెల్లెళ్లు జలసమాధి
బెంగళూరు: ఇంటిముందు ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లు నీటి సంపులో పడి జలసమాధి అయిన సంఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. శివమొగ్గలోని వినోబా నగరలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. బోమ్మనకట్టైలో నివాసం ఉంటున్న నాగరాజ్ అనే ఆయనకు తరుణ్ (5), దీప్తి (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నిర్మాణంలో ఉన్న ఇంటిముందు నీటి సంపు (వాటర్ ట్యాంక్) ఏర్పాటు చేశారు. కట్టడం నిర్మాణానికి అవసరం అయిన నీరు సంపులో నింపారు. తరుణ్, దీప్తి సాటి పిల్లలతో ఆడుకొవడానికి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారు తిరిగిరాలేదు. నాగరాజ్ పిల్లల కోసం చుట్టు పక్కల గాలించారు.
తెలిసిన వారి దగ్గర విచారించారు. చివరికి అనుమానం వచ్చి నీటి సంపులో చూడగా ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఒకే సారి అన్నాచెల్లెళ్లు జలసమాధి కావడంతో అక్కడ విషాదచాయలు నెలకొన్నాయి.

మహిళ ప్రాణం తీసిన రివర్స్ గేర్!
చెరువు పక్కన శుభ్రం చేస్తున్న సమయంలో గోడ కుప్పకూలి మహిళ దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలో జరిగింది. టీ సీ పాళ్యలో వెంగయ్యన చెరువు ఉంది. ఈ చెరువు చుట్టు 12 అడుగల ఎత్తులో గొడ నిర్మించారు.
ఇక్కడ స్వానీ మేరి (45), సిద్దమ్మ అనే ఇద్దరు శుభ్రం చేసే పని చేస్తున్నారు. బుధవారం టిప్పర్ లారీలో టీసీ పాళ్యకు చక్కర మూటలు తీసుకుని వెళ్లారు. చక్కర మూటలు అన్ లోడ్ చేసిన తర్వాత టిప్పర్‌ను రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపారు. ఆ సందర్బంలో టిప్పర్ గోడను ఢీకొట్టింది. 12 అడుగుల గొడ కుప్పకూలిపోయింది. పక్కనే చెత్త శుభ్రం చేస్తున్న స్వాని మేరి మీద పడటంతో ఆమె మరణించింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications