Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sister: ఆస్తి కోసం సొంత చెల్లెలు, బావను అడ్డంగా నరికేసిన కిరాతకుడు !

చెన్నై/తుత్తుకూడి: డబ్బు, ఆస్తుల విషయంలో సొంత మనుషులను కూడా శత్రువులుగా చూసే రోజులు వచ్చేశాయి. సొంత సోదరుడి ఆస్తి బయట వాళ్లు కొంటే మనకంటూ పరువు మర్యాద ఉండదని చెల్లెలు అనుకుంది. అన్న ఆస్తిని మనం కొనుక్కుందామని చెల్లెలు ఆమె భర్తకు చెప్పింది. అన్న ఆస్తి కొనుగోలు చేసిన పాపానికి అదే అన్న చేతిలో చెల్లెలు, ఆమె భర్త దారుణ హత్యకు గురైనారు.

తమిళనాడులోని తూత్తుకుడిలోని అన్నానగర్‌ ఆరో వీధిలో రామ్ కుమార్‌ నివాసం ఉంటున్నాడు. రామ్ కుమార్ లారీ ఓనర్. రామ్ కుమార్ భార్య మరియమ్మాళ్. దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలో నివసిస్తున్న తన సోదరుడు మురుగేషన్ ఇంటిని ఇటీవల మరియమ్మాల్, రామ్ కుమార్ దంపతులు కొనుగోలు చేశారు.

Brother who killed own sister and brother-in-law for property in Tamil Nadu.

ఇంటి కొనుగోలు విషయంలో మరియమ్మాళ్ కుటుంబానికి, అతని సోదరుడు మురుగేశన్ కుటుంబానికి మధ్య విబేధాలు వచ్చాయి. ఆదివారం రాత్రి మురుగేశన్, అతని కుమారుడు మహేష్ ఇద్దరూ అన్నానగర్‌లోని రామ్‌ కుమార్‌ను చంపేందుకు అక్కడికి వెళ్లారు. చెల్లెలు మరియమ్మాళ్ భర్త రామ్ కుమార్ మీద దాడి చేశారు.

ఇంట్లో ఉన్న రామ్ కుమార్ భార్య మరియమ్మళ్ అన్న మురగేషన్, మేనల్లుడు మహేష్ కు అడ్డుపడింది. ఆ సందర్బంలో మురగేషన్, అతని కొడుకు మరియమ్మాల్ చెల్లెలు అని కూడా చూడకుండా ఆమె మీద కొడవళ్లతో దాడి చేశారు. దీంతో రామ్ కుమార్, మరియమ్మాళ్ ఇద్దరూ రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని మురగేషన్, మహేష్ ల కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+