ఆరోజు పక్కన పెట్టిన లీడర్ ఈ రోజు పరువు కాపాడుతున్నాడు, మోదీ, అమిత్ షా ఫుల్ పవర్స్ ఇచ్చేసి !
లోక్‌సభ ఎన్నికలకు టికెట్ కేటాయింపులో పార్టీపై ఉన్న అసంతృప్తిని పరిష్కరించేందుకు బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ఎస్ వైఎస్ ముందుండి కథ నడిపిస్తున్నారు. ఈ కారణంగా కుమారుడు, బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై.విజయేంద్రతో కలిసి అసమ్మతితో ఉన్న బీజేపీ నాయకులను బుజ్జగించే పనిలో యడియూరప్ప తీరికలేకుండా నిమగ్నం అయ్యారు.
సొంత పార్టీ బీజేపీ మీద తిరుగుబాటు చేసిన నాయకులను ఒప్పించి పార్టీ మారకుండా ఉండే సవాళ్లను మీరే ముందువుండి చూసుకోవాలని బీజేపీ హైకమాండ్ మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు సూచించింది. గత వారం రోజులుగా మాజీ సీఎం యడియూరప్ప బెంగళూరులోని ఆయన నివాసంలో వరుసగా వివిధ నియోజక వర్గాల్లోని అసమ్మతి నాయకులను కలవడం ద్వారా వారి అసంతృప్తిని పరిశీలించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ వైపు చూసిన కొప్పుళ నియోజకవర్గానికి చెందిన ఎంపీ కరడి సంగన్నతో పాటు పలువురు నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన యడియూరప్ప వాళ్లకు నచ్చచెప్పి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కట్టడి చెయ్యడంలో విజయం సాధించారు. ఎంపీ కరడి సంగన్న చివరికి చల్లబడి బీజేపీలోనే ఉండిపోయారు. కొప్పళ నియోజక వర్గంలోని అనేక మంది బీజేపీ నాయకులు పార్టీ మారకుండా యడియూరప్ప జాగ్రత్తలు తీసుకున్నారు.

దావణనగెరె వెళ్లి బహిరంగంగానే అసంతృప్తిని వెల్లడించిన మాజీ మంత్రి అయిన ఎస్.ఎ.రవీంద్రనాథ్, ఎంపీ రేణుకచార్యలతో చర్చలు జరిపి వారు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ణాటక బీజేపీ పార్టీ రాష్ట్ర ఎన్నికల బాధ్యతల ఇన్ చార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్, విధాన పరిషత్ పార్టీ ముఖ్య నాయకుడు ఎన్.రవికుమార్ మాజీ సీఎం యడియూరప్పకు పూర్తి సహకారం అందిస్తున్నారు. బీజేపీ మీద తిరుబాటు చేసి పార్టీకి డ్యామేజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న నాయకులు అందరితో మాజీ సీఎం యడియూరప్ప చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications