200కంపెనీలు డీలిస్ట్!: ఆర్నెళ్ల పాటు ట్రేడింగ్ రద్దు చేసిన బీఎస్ఈ
Recommended Video

ముంబై: అక్రమ పద్దతుల్లో ఫండ్స్ తీసుకొస్తున్నారన్న కారణంగా దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ 200 కంపెనీలపై వేటు వేసింది. ఈ మేరకు మే 11 నుంచి వీటిని బీఎస్ఈ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు(డీలిస్ట్) ప్రకటించింది.
డీలిస్ట్ లో ఉన్న కంపెనీలు ఆర్నెళ్ల పాటు షేర్ల ట్రేడింగ్ జరపకుండా బీఎస్ఈ రద్దు చేసింది. అక్రమ ఫండ్స్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టింది. కాగా, గతేడాది ఆగస్టులోనే సెబీ 331 డొల్ల కంపెనీలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్‌లను ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ 200కంపెనీలపై వేటు వేయగా.. అటు ప్రభుత్వం సైతం చాలా కాలంగా కార్యకలాపాలు సాగించని 2లక్షలకు పైగా సంస్థలను డీరిజిస్టర్ చేసింది. ఈ మేరకు రెండు సర్క్యులర్లను బీఎస్ఈ జారీ చేసింది. 188కంపెనీల ట్రేడింగ్ నిలిపివేస్తున్నామని, మే 11నుంచి వాటిని తమ ప్లాట్ ఫామ్ పై నుంచి డీలిస్ట్ చేస్తామని ఒక సర్క్యులర్ లో బీఎస్ఈ పేర్కొంది.
మరొక సర్క్యులర్ లో మరో 14సంస్థలను కూడా ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్లాట్ ఫామ్ నుంచి కంపల్సరీ డీలిస్ట్ అయిన పూర్తి కాలపు డైరెక్టర్లు, ప్రమోటర్లను, గ్రూప్ సంస్థను మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించకుండా 10ఏళ్ల పాటు రద్దు చేయనుంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications