చైనా ఆటకట్టు: కటిక చీకట్లో కదలికలను పసిగట్టేలా..!!
న్యూఢిల్లీ: లఢక్ (Ladhak) సమీపంలో గల వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు వెంబడి తరచూ ఉద్రిక్తతలకు పాల్పడుతూ భారత్ (India)ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా (China) ఆటను కట్టించడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది ఆర్మీ. దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని తీసుకుంటోంది.
లఢక్ మొదలుకుని సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) వరకూ తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోంది. అటు జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దుల్లో పాకిస్తాన్ (Pakistan) వైపు నుంచి కూడా ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నారు.

మరోవంక- పశ్చిమ బెంగాల్ (West Bengal) సరిహద్దుల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్ (Myanmar) నుంచి పెద్ద ఎత్తున అసాంఘిక శక్తులు అక్రమంగా సరిహద్దులను దాటుకుని పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అడుగు పెడుతున్నాయి. చొరబాటుదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆర్మీ కీలక ముందడుగు వేసింది.

కటిక చీకట్లో సైతం చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలను పసిగట్ట కలిగే అత్యాధునికమైన డ్రోన్ల (Drones)ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వాటిని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నైట్ విజన్ డ్రోన్ల (Night vision drones)ను వాడుకలోకి తీసుకొచ్చింది. సరిహద్దు భద్రత దళం (BSF) నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ (North Bengal Frontier) ఆరో బెటాలియన్ ట్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది.

ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విజయవంతంగా వినియోగించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. నైట్ విజన్‌లో శతృవుల కదలికలను విజయవంతంగా పసిగట్టినట్లు తెలిపింది. ఈ నైట్ విజన్ డ్రోన్లను లఢక్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మోహరింపజేసే అవకాశాలను పరిశీలిస్తోన్నామని పేర్కొంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications