సీఎం నివాసం వద్ద కాల్పులు, సెక్యూరిటీపై ఒమర్ ట్వీట్

BSF jawan opens fire at J&K CM's residence
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాను దగ్గర ఉన్న ఆటోమేటిక్ పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. వెంటనే అతని వద్ద ఉన్న ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాసం వద్దే ఒకటి కన్నా ఎక్కువసార్లు తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అంతా ఏదో జరిగిందని ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకు వచ్చారు.

ఈ కాల్పులు.. తొలుత మిలిటెంట్ల దాడి అనుకున్నారు. ఆ తర్వాత ఒమర్ ఇంటి ముందు డ్యూటీ చేస్తున్న బీఎస్ఎఫ్ జవానే పేల్చాడని, అదీ ప్రమాదవశాత్తూ పేలిందని తెలియడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. జవానును అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

కాగా, కాల్పులు జరిపిన జవాను మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. తన భద్రతపై ఎటువంటి సందేహాలు లేవని, తన సెక్యూరిటీ టీం పైన పూర్తి నమ్మకం ఉందని ఈ సంఘటన అనంతరం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+