తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీ ఇస్తున్న BSNL ప్లాన్లు
BSNL సిమ్ కార్డు వాడేవారంతా నెట్ కోసం మరో కంపెనీ సిమ్ ను వాడుతుంటారు. జియో, వొడాఫోన్, ఎయిర్ టెల్ వంటివి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను అందించలేదు. ఒక్క BSNL మాత్రమే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను అందించగలుగుతోంది. 4జి నెట్ వర్క్ ఏ ప్రాంతంలో అయినా వేగంగా వస్తోంది. దీంతో చాలామంది BSNL నెంబర్లను మార్చకుండా వాటినే ఉపయోగిస్తుంటారు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా ప్రత్యేకంగా డేటా రీఛార్జి చేయించి వాడుతుంటారు. అటువంటివారికోసం సంస్థ కొత్తగా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. రూ.439 ప్లాన్ తీసుకున్నవారికి అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి BSNL కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.

రూ.439 ప్లాన్ ద్వారా 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రస్తుతానికి దేశంలోని ఏ టెలికం కంపెనీ కూడా ఇంత తక్కువ ధరకు ప్లాన్లను అందించడంలేదు. ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనాలుండవు. 300 మెసేజ్ లు పంపించుకోవచ్చు. అలాగే అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈప్లాన్ ద్వారా సంస్థ కొత్తగా వినియోగదారులను ఆకర్షించాలనుకుంటోంది. వాయిస్ కాలింగుకు ప్రాముఖ్యత ఇచ్చింది. డేటా అవసరంలేని వినియోగదారులు ఈ ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు.
రూ.439తో పాటు రూ.699 ప్లాన్ కూడా తెచ్చింది. ఇందులో 130 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. నాలుగు నెలలకన్నా ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది ఉత్తమమైన ప్లాన్ అని చెప్పవచ్చు. దీనికి కూడా అన్‌లిమిటెడ్ కాల్స్ ప్రయోజనాలున్నాయి.
యూజర్లకు రోజుకు 0.25 వరకు ఉచిత డేటా లభిస్తుంది. ఇది పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40KBPSకు తగ్గుతుంది. తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన వారికి ఈ డేటా సరిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకు 100 మెసేజ్ లు పంపించుకోవచ్చు.












Click it and Unblock the Notifications