పార్లమెంట్‌లో కరోనా కలకలం.. బీఎస్పీ ఎంపీకి పాజిటివ్.. రెండు డోసులు వేసుకున్నప్పటికీ..
పార్లమెంటులో కరోన కలకలం రేపుతోంది. సోమవారం వరకు లోకసభకు హాజైన బీఏస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఎంపీలలో ఆందోళన మొదలైంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ ఎంపీకి కరోనా సోకింది.
బీఎస్పీ ఎంపీకి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కరోనా వైరస్ వెలుగు చూసింది. సోమవారం కూడా లోక్ సభకు బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ హాజరైయ్యారు . అయితే ఒంట్లో నలత, జ్వరంగా ఉండడంతో కరోనా టెస్ట్ చేయించారు. పరీక్షల్లో వెరస్ పాజిటివ్‌గా తేలిందని తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

వ్యాక్సిన రెండు డోసులు వేసుకున్నప్పటీకీ..
తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డానిష్ అలీ కోరారు . స్వీయ నిర్బంధంలో ఉండాలని తన తోటి ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని , త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ వైరస్ సోకిందని ఎంపీ కున్వార్ డానిష్ అలీ పేర్కొన్నారు.

దేశంలో పెరిగిన మరణాలు
దేశంలో ప్రస్తుతం 79, 097 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సొమవారం 5,326 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,043 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 453 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారిన సంఖ్య 4,78,007లకు చేరుకుంది.

ఒమిక్రాన్ విజృంభణ
మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో 200 మందికిపై బాధితులు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో ఈకేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా మహారాష్ట్ర 54, ఢిల్లీ, 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్ 18, గుజరాత్ 14, ఉత్తరప్రదేశ్2, ఏపీ, తమిళనాడు, చండీగఢ్, పశ్చిమబెంగాల్ లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి. అయితే వీరందరికీ సాధారణ లక్షణాలే ఉన్నాయని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications