వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

|
Google Oneindia TeluguNews

2021-22 బడ్జెట్ ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆయన కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సరయిన కేటాయింపులు ఉంటాయని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ భరోసాతో బడ్జెట్ ఉంటుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకెళ్తుందని చెప్పారు.

కరోనా వల్ల దెబ్బతిన్న వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యమని అనురాగ్ ఠాకూర్ వివరించారు. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థికశాఖ కార్యాలయానికి వచ్చేముందు మంత్రి అనురాగ్ ఠాకూర్ తన ఇంటి వద్ద పూజ చేశారు. ఈ సారి డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఫస్ట్ టైం డిజిటల్ పద్ధతిలో పద్దును నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ముందుకు బడ్జెట్ తీసుకొస్తారు.

budget 2021: to be in accordance with expectorations of people: Anurag Thakur

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన కార్యాలయానికి చేరుకున్నారు. ఇంటినుంచి బయల్దేరి ఉదయం 8.46 గంటలకు ఆఫీసు చేరుకున్నారు. అక్కడినుంచి రాష్ట్రపతి భవన్ వెళతారు. అక్కడ బడ్జెట్ ప్రతీని రాష్ట్రపతికి అందజేస్తారు. సహా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇక్కడ బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపగానే నేరుగా లోక్ సభకు వెళతారు. అక్కడ బడ్జెట్ ప్రసంగం చదువుతారు.

Recommended Video

Parliament Canteen : Subsidy Gone, Here's The New Rate List For Parliament Canteen

English summary
Budget will be in accordance with people's expectations MoS Finance Anurag Thakur said.2020-21
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X