దేశ రక్షణకు పెద్దపీట.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు
దేశ రక్షణకు 2022-23 బడ్జెట్‌లో కేంద్రం పెద్ద పీట వేసింది. గత ఏడాదికి కంటే ఎక్కువగా నిధులు కేటాయింది. దేశ సరిహద్దుల్లో పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి ఎదువుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగానికి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులను పెంచారు. దేశీయ అవసరాల కోసం రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించనుంది. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద స్వయం ఆధారిత రక్షణ రంగాన్ని కలిగి ఉండడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

సాయుధ బలగాల ఆధునీకరణకు నిధులు
2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 5.25 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది రక్షణ రంగానికి రూ. 4.75 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది పోలిస్తే ఈ సంవత్సరం రూ. 47,000 కోట్లు ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు.
సాయుధ బలగాల ఆధునీకరణకు రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 68 శాతం నిధులు దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్‌లో గత ఏడాది కేటాయించిన రూ.1.35 లక్షల కోట్ల కంటే దాదాపు 13 శాతం ఎక్కువ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

రక్షణ రంగంలో పరిశ్రమలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం
రక్షణ రంగంలో స్టార్టప్‌లు , పరిశ్రమలు, విద్యాసంస్థల కోసం రక్షణ పరిశోధన ,అభివృద్ధి ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, ఇతర సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రయోజన వాహనం మోడల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో సైనిక ప్లాట్‌ఫారమ్‌లు, పరికరాల రూపకల్పన, అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు.

.వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి పునాది
వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ 2022-23 బడ్జెట్ పునాది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పీఎం గతి శక్తి పథకంలో సంతులిత అభివృద్థి సాధించామని లోక్‌సభలో చెప్పారు.దేశ ఆర్థిక వృద్థికి దోహదం చేస్తుందని తెలిపారు. దేశంలో స్టార్టప్ కంపెనీలను డ్రోన్ శక్తి కింద ప్రోత్సహిస్తామని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీకి ఈ బడ్జెట్‌లో పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications