Budget 2024-25 LIVE Updates : ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి: నిర్మలమ్మ
కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.ఇది సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని లేదా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు.ఈ బడ్జెట్ కేవలం మూడునెలల సమయానికి మాత్రమే ఉంటుంది. సాధారణ ఎన్నికలు ముగిశాక అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం జూలై మాసంలో 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతుంది.
ఇక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్ అవుతుందా అనేది చాలామందిలో చర్చ జరుగుతోంది. నిర్మలమ్మ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వేతన జీవులు ఎప్పుడూ ఎదురు చూసే పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారనేది ఇంట్రెస్టింగా మారింది.

ఇక విద్య వైద్య వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఇక ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారో, ఎలింటి ప్రకటనలు చేస్తారు అనే అంశాలు తెలుసుకునేందుకు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.












Click it and Unblock the Notifications